పిన్నెల్లిని పట్టించిన ఆయన ఎట్లా చనిపోయారంటే...
x
పిన్నెల్లితో ఘర్షణ పడుతున్న శేషగిరిరావు (ఎడమ) శేషగిరి రావు (కుడి)

పిన్నెల్లిని పట్టించిన ఆయన ఎట్లా చనిపోయారంటే...

అక్కడ తీసిన ఓ ఫోటో చాలా కాలం మీడియా చక్కర్లు కొట్టింది. ఆనాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టించింది.


2024 మే 13.. పల్నాడు జిల్లా.. పాలువాయిగేటు గ్రామం.. అక్కడ తీసిన ఓ ఫోటో చాలా కాలం మీడియా చక్కర్లు కొట్టింది. ఆనాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టించింది. ఆ ఫోటోయే ఆ ఊరి తెలుగుదేశం నాయకుడు నంబూరు శేషగిరిరావుది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాలువాయిగేటు గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టినట్టు రికార్డు అయింది. అదే బూత్‌లో తెలుగుదేశం ఏజెంటుగా ఉన్న నంబూరి శేషగిరిరావు పిన్నెల్లిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ జరిగిన ఘర్షణ పెద్ద వివాదానికే దారి తీసింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగానే స్పందించేలా చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత పిన్నెల్లి అనుచరులు కొందరు నంబూరు శేషగిరిరావుపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. శేషగిరిరావు చూపిన తెగువను నాడు చంద్రబాబు, లోకేశ్‌ ప్రశంసించారు. ఆ తర్వాత పిన్నెల్లిపై కేసు కట్టి అరెస్ట్ చేశారు.
ఆ శేషగిరి రావు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుండెపోటుతో ఆయన మరణించారు. శేషగిరిరావుకు భార్య కృష్ణవేణి, కుమారుడు దత్తసాయి, కుమార్తె జాహ్నవి ఉన్నారు. గుంటూరు, హైదరాబాద్‌లలో చదువుకుంటున్నారు. పిల్లల దగ్గరకు తల్లి వెళ్ళినపుడు ఈ దుర్ఘటన జరిగింది.

ఉన్నారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి.. శేషగిరిరావు మృతదేహానికి నివాళులు అర్పించారు. గుండెపోటుతో మరణించిన శేషగిరిరావు కుటుంబ సభ్యుల్ని సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. శేషగిరిరావు కుమారుడు, కుమార్తెలతో ఆయన మాట్లాడారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. శేషగిరిరావు మృతి వార్త తనను బాధించిందని మంత్రి నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read More
Next Story