కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పాకా సురేష్ ఏకగ్రీవ ఎన్నిక
x
కడప మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్

కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పాకా సురేష్ ఏకగ్రీవ ఎన్నిక

కడప మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధిాంచారు.


కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ పాకా సురేష్ బాబు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఎన్నికల సభలో వైకాపా కార్పొరేటర్లు ఏకతాటిపై నిలిచారు.
మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ బాబు పేరును వైకాపా కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించగా, డిప్యూటీ మేయర్ పదవికి నిత్యానంద రెడ్డి, మహమ్మద్ షఫీల పేర్లను బలపర్చారు. ప్రతిపక్షాల నుంచి ఎటువంటి నామినేషన్లు రాకపోవడంతో ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, పాకా సురేష్ బాబును కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా, నిత్యానంద రెడ్డి, మహమ్మద్ షఫీలను డిప్యూటీ మేయర్లుగా అధికారికంగా ప్రకటించారు.
ఎన్నికల అనంతరం కొలువు తీరిన కొత్త మేయర్ పాకా సురేష్ బాబు మాట్లాడుతూ, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కడప నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story