జగన్ లండన్ టూర్‌కు తొలగిన అడ్డంకులు
ఈ నెల 11 నుంచి 30 వరకు జగన్ లండన్‌కు వెళ్లనున్నారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డేకు జగన్ హాజరు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్ పర్యటనపై కమ్ముకున్న అడ్డంకులన్నీ తొలగి పోయాయి. దీంతో లండన్‌కు వెళ్లేందుకు జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు నుంచి అనుమతులు లభిస్తాయా అనే ఉత్కంఠకు తెరపడింది. సీబీఐ కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో జగన్‌మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు మార్గం సుగమమైంది. జనవరి 11 నుంచి 30వ తేదీ వరకు లండన్‌కు వెళ్లేందుకు జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు అనుమతించింది.
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇతర దేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో లండన్‌కు వెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం అక్కడకు వెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన సీబీఐ కోర్టు 20 రోజుల పాటు లండన్‌కు వెళ్లేందుకు జగన్‌మోహన్‌రెడ్డికి అనుమతులు జారీ చేసింది.
ఇది వరకు కూడా జగన్‌కు ఇలాంటి సమస్యలే ఏర్పడ్డాయి. ఇతర దేశాలకు వెళ్లాలనుకున్న ప్రతీ సారి సీబీఐ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత సెప్టెంబరులో కూడా సీబీఐ కోర్టు నుంచి అనుమతులు పొందిన తర్వాతనే లండన్‌కు వెళ్లారు. లండన్‌లో చదువుతున్న పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అప్పుడు లండన్‌కు వెళ్లారు. మేలో కూడా జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఎన్నికల అనంతరం ఆయన యూరప్ టూర్‌కు వెళ్లారు. యూకేతో పాటు స్విట్జర్లాండ్‌లోను పర్యటించారు. ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు తాడేపల్లికి చేరుకున్నారు. నాడు కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని నాడు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా దానిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు అనుమతులు మంజూరు చేసింది.
అయితే ఈ సారి జగన్‌మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు పాస్‌పోర్టు సమస్యలు కూడా తెరపైకొచ్చాయి. దీనిపైన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్‌కు ఊరట లభించింది. పాస్ పోర్టు పొందేందుకు జగన్‌కు ఎన్వోసీని జారీ చేసింది. ఐదేళ్ల కాల పరిమితితో జగన్‌మోహన్‌రెడ్డికి పాస్ పోర్టు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
Next Story