సమాజానికి కావలసింది పారిశ్రామికవేత్తలే
x

సమాజానికి కావలసింది పారిశ్రామికవేత్తలే

ఢిల్లీలో జరిగిన సీఐఐ యాన్యువల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.


ప్రస్తుత సమాజానికి పారిశ్రామికత్తేలే కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్, టూరిజం రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని, వీటితో పాటు మిగిలిన రంగాల్లో కూడా పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ అనువైన ప్రాంతమని, ఇండస్ట్రీస్‌ పెట్టేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సీఐఐ వార్షిక బిజెనెస్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పారిశ్రామివత్తల ద్వారానే ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి సాధ్యం అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతమని, ఏపీలో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకునేందుకు రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

నాటి ప్రధాన మంత్రి పీవీ నరసింహ్మరావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశం ఎంతో ప్రగతి సాధించిందని, 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని తాను అందిపుచ్చుకున్నారని, దీంతో హైదరాబాద్‌ ఎంతో డెవలప్‌ చేశామని వెల్లడించారు. డెమోగ్రఫిక్‌ డివిడెంట్‌ను భారత దేశం సరిగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం సమాజానికి కావలసింది పారిశ్రామికవేత్తలే అని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ బాగా పెరుగుతున్న ఈ తరుణంలో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్లు వంటి టెక్నాలజీలు కీలకంగా మారాయని అన్నారు. వీటితో పాటుగా సీసీకెమేరాలు, సెన్సార్లు, ఐఓటీలు వంటి టెక్నాలజీలకు కూడా మంచి డిమాండ్‌ ఉందన్నారు.
దేశంలోనే మొట్ట మొదటి క్వాంటం వ్వాలీని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖకు గూగుల్‌ రానుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ ఎనర్జీకి అవకాశాలు మెండుగా ఉన్నాయని, సోలార్, విండ్, పంప్డ్‌ ఎనర్జీ వంటి అనేక రకాల ఎనర్జీలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతానికి ముందు వరుసలో ఉందని, ఈ రంగాల్లో పరిశ్రములు స్థాపించేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్నానని, తాను తొలి నాటి నుంచి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read More
Next Story