
ఇక చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంతు
పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు షాక్ తగిలింది.
ఏపీలోకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదు కొసాగుతున్న తరుణంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంతు వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని చెవిరెడ్డి మీద కేసు నమోదు చేశారు. దాదాపు ఐదు కేసులు చెవిరెడ్డి మీద కేసులు నమోదు చేశారు. తాజాగా బుధవారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి నోటీసులు జారీ చేయడం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.
2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్‌ను చెవిరెడ్డి ఉల్లంఘించారని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారివీరుడులో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ ఐదు కేసుల్లో ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను కూడా చెవిరెడ్డి బెదిరించారనే కేసు కూడా ఉంది. తమకు అనుకూలంగా పని చేయడం లేదంటూ చెవిరెడ్డి ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖ మీద బెదిరింపులకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.
ఈ ఐదు కేసులకు సంబంధించి తాజాగా ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఒంగోలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య నోటీసులు అందజేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు ఆదేశించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న వేళ చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. మరో వైపు టీడీపీ కార్యాలయం దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే విజయవాడ జైల్లో ఉన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేషల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని కీలక వైఎస్‌ఆర్‌సీపీ నేత, సిటీ నటుడు పోసాని కృష్ణమురళి మీద రాష్ట్ర వ్యాప్తంగ కేసులు నమోదు కావడంతో జైలు పాలయ్యారు. కేసుల విచారణ నిమిత్తం పలు ప్రాంతాలకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసులు తెరపైకి రావడంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు కలవరానికి గురవుతున్నారు. అయితే పోలీసుల విచారణకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరు అవుతారా? లేదా? అనేది ఆసక్తి కరంగా మారింది.
Next Story