ఆదాయాల్లేవు..అప్పులు, అవినీతి పెరిగాయి
x

ఆదాయాల్లేవు..అప్పులు, అవినీతి పెరిగాయి

కాగ్‌ నివేదికను ప్రస్తావిస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ఆర్థిక స్థితిగతుల మీద స్పందించారు.


ఎడా పెడా చేసేస్తున్న అప్పుల మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగ్‌ నివేదికను ప్రస్తావిస్తూ ఆయన రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద స్పందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందన్నారు. ఆ మేరకు గణాంకాలను కూడా ఆయన ప్రస్తావించారు.

కాగ్‌ నివేదించిన నెలవారీ ఇండికేటర్ల గణాంకాల ప్రకారం ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంలో ఉందన్నారు. పన్నులు, పన్నేతర రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలలో పురోగతి లేదన్నారు. మందగమనంలో ఉన్నాయన్నారు. జీఎస్‌టీ, సేల్స్‌ ట్యాక్స్‌ వంటి ఇన్‌కమ్‌ వనరులు గత ఏడాది కంటే తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని శాఖల్లో అయితే ఇంకా దారుణంగా వృద్ధి రేటు ఉందన్నారు. ఏపీ రాష్ట్ర సొంత ఇన్‌కమ్‌ కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయన్నారు. కేంద్ర నుంచి వచ్చే ఆదాయాలతో సహా రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయాలు 6.14 శాతం మ్రాతమే పెరిగిందన్నారు. అప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా 15.61 శాతంగా శరవేగంగా పెరిగాయన్నారు. ఒక వైపు ఆదాయాలు లేక పోగా మరో వైపు శరవేగంగా అప్పులు పెరిగి పోతున్నాయని ఆందోళనలు వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుని పోయిందన్నారు. దీని వల్ల ఆర్థిక స్థిరత్వం సరిగా లేదన్నారు. దీంతో పాటుగా నిర్వహణ కూడా సరిగా లేదన్నారు. రాష్ట్ర విభజనతో మొదలైన ఈ సమస్య ఇప్పుడు మరింత తీవ్రంగా మారిందన్నారు. దీనికి తోడు ఏపీలో అవినితీ విపరీతంగా పెరిగి పోయిందని మండిపడ్డారు. ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఒత్తిడి గురువుతున్నా దానికి సంకేతమని పేర్కొన్నారు. మరో వైపు సీఎం చంద్రబాబు, ఇతర మంత్రుల ఖర్చులు, ప్రభుత్వం ఖర్చులు కూడా రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇది ప్రమాదకర పరిస్థితి అని మాజీ సీఎం జగన్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.


Read More
Next Story