బెనిఫిట్‌ షోలు వద్దు
x

బెనిఫిట్‌ షోలు వద్దు

నిర్మాత దిల్‌ రాజు, ఏపీ డీప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.


ఆంధ్రప్రదేశ్‌లో గేమ్‌ చేంజర్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు నిర్ణయించామని, ఈ మెగా ఈవెంట్‌కు మీరు హాజరు కావాలని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్, గేమ్‌ చేంజర్‌ సినిమా నిర్మాత దిల్‌ రాజు సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆహ్వానించారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా నటుడు కావడం, సినిమా రంగంకు సంబంధించిన సమస్యలపైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఆయనను ఆహ్వానిస్తున్నట్లు దిల్‌ రాజు ఇది వరకే వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన దిల్‌ రాజు బయటకు రాగానే అక్కడే ఉన్న జర్నలిస్టులతో పవన్‌ కల్యాణ్‌ చిట్‌ చాట్‌ నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్‌ అరెస్టు వ్యవహారంపై మాట్లాడుతూ గోటితో పోయే దానిని గొడ్డలి దాక తెచ్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు.

రామ్‌చరణ్‌ గేమ్‌ చేంజర్‌ ఈవెంట్‌కు హాజరవుతున్నారా? లేదా? అనే విషయం మాత్రం బయటకు చెప్ప లేదు. అయితే జనవరి 4న రాజమండ్రిలో గేమ్‌ చేంజర్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశామని, దానికి తప్పకుండా హాజరు కావాలని దిల్‌ రాజు పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించారు. సినిమా రిలీజ్‌ సమయంలో టికెట్ల పెంపుదల, బెనిఫిట్‌ షోలు తదితర అంశాలను దిల్‌ రాజు ప్రస్తావించినా..అనుమతించడం సాధ్యం కాదనే విషయం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశాలలో తెలంగాణలో బెనిఫిట్‌ షోలకు అవకాశం ఇవ్వక పోవడం, మహిళా అభిమాని మృతికి కారణమవడం, భవిష్యత్‌లోను టెకెట్ల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవని స్పష్టమైంది. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లోను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Read More
Next Story