ఐదు నెలల క్రితమే పెళ్లైంది..పాపం నవ వధువు
x

ఐదు నెలల క్రితమే పెళ్లైంది..పాపం నవ వధువు

కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం అర్థరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.


ఐదు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి కుమారుడు విలేజ్‌ సర్వేయర్‌గా పని చేస్తుండగా, పెళ్లి కూతురు శ్రీచైతన్య కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. పెళ్లి అయిన తర్వాత ఐదు నెలలు సంతోషంగానే గడిపారు. భార్య భర్తలిద్దరు అన్యోన్యంగానే ఉంటున్నారు. తర్వాత కుటుంబ కలహాలు వారి జీవితంలోకి ఎంటర్‌ అయ్యాయి. వీటికి కలత చెందిన నవ వధువు శ్రీవిద్య ఆదివారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా మారింది. విషయం తెలుసుకున్న శ్రీవిద్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్యతో అదే జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్‌తో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. శ్రీవిద్య ఉయ్యూరులోని శ్రీచైతన్య కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తుండగా, అరుణ్‌కుమార్‌ పక్కనే ఉన్న కలాపాముల గ్రామంలో విలేజ్‌ సర్వేయర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కొత్త జంట ఐదు నెలల వరకు బాగానే కాపురం చేశారు. అయితే అత్తారింట్లో కుటుంబాలు మొదలయ్యాయి. ఇవి పెరిగి పెద్దవి అవుతుండటంతో శ్రీవిద్య వాటిని తట్టుకోలేక పోయింది. కుటుంబ కలహాలతో విసిగెత్తి పోయిన శ్రీవిద్య ఆదివారం అర్థరాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకుంది. విషయం తెలుసుకున్న శ్రీవిద్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు కలకాలం సంతోషంగా జీవిస్తుందని ఆశపడ్డ తల్లిదండ్రులు శ్రీవిద్య ఆత్మహత్యను జీర్ణించుకోలేక పోతున్నారు.
మరో వైపు పెళ్లైన నాటి నుంచి శ్రీవిద్య అత్తారింట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నాయని, వీటి వల్లే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More
Next Story