ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసు..పవన్ కే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
x

ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసు..పవన్ కే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

ఈ కేసులో ఏ2 గా మారిన టీడీపీ ఎమ్మెల్యే, ఏ1గా బుక్కైన జనసేన నేత


శ్రీశైలం అటవీ సిబ్బందిపై తెలుగుదేశం ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ దాడి చేశారన్న కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయింది..అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించి నిందుతులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని , ఆ దిశగానే కేసులు నమోదు చేయండని పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించారు.తీరా కేసు నమోదులో శ్రీశైలం పోలీసులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కే షాకిచ్చారు.ఈ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

అయితే ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఏ2గా మాత్రమే పెట్టి జనసేన నేత అశోక్ రౌత్ ను మాత్రం ఏ1గా పెట్టి కేసు నమోదు చేశారు. దీంతో జనసేన శ్రేణులకు దిమ్మతిరిగి నట్లయ్యింది.ఒక్కసారిగా కేసు మలుపుతిరిగినట్లయ్యింది. టీడీపీ ఎమ్మెల్యేను తప్పించేందుకే ఈ కేసులో ఏ2గా పెట్టారని, తమ పార్టీకి చెందిన నాయకుడిని ఏ1గా పెట్టారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. అలాగే వీరిద్దరిపైనా బెయిలబుల్ కేసులే పెట్టడం మరో విశేషం.
శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అటవీ సిబ్బందిని బంధించి కార్లలో తిప్పుతూ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని అటవీ సిబ్బంది కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో పాటు సాక్ష్యాలు కూడా విడుదల చేశారు.కానీ తెల్లారే సరికి సీన్ మారిపోయింది. జనసేన నేత అశోక్ రౌత్ ను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.సీసీ ఫుటేజ్ లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నా ఆయన్ను ఏ2గా పెట్టడం, జనసేన నేతను ఏ1గా పెట్టడం ఏంటన్న చర్చ జరుగుతోంది. అలాగే వీరిద్దరిపైనా బెయిల్ లభించేలా కేసు పెట్టడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి వుంది.అటవీ శాఖ పవన్ కళ్యాణ్ దగ్గర వున్నది కాబట్టి టీడిపీ ఎమ్మెల్యేకు తిప్పలు తప్పవని,కూటమిలో విభేదాలు రాకుండా ఉండేందుకే చంద్రబాబు కూడా త్వరగా స్పందించారని అందరూ అనుకుంటున్న సమయంలో ఈ కొత్త ట్వీస్ట్ ఎటుదారి తీస్తుందో చూడాలి.
Read More
Next Story