Telangana Talli statue|తెలంగాణా తల్లి విగ్రహంపై కొత్త వివాదం
x

Telangana Talli statue|తెలంగాణా తల్లి విగ్రహంపై కొత్త వివాదం

తెలంగాణా తల్లి(Telangana Talli) విగ్రహాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ దేనికి ఇష్టంవచ్చినట్లు ఆ రూపంలో తయారు చేయించుకుంటున్నాయి


తెలంగాణా తల్లి విగ్రహంపై వివాదం మొదలైంది. నిజానికి ఈ విగ్రహం పై చాలాకాలంగా వివాదాలు కొనసాగుతునే ఉన్నాయి. తెలంగాణా తల్లి(Telangana Talli) విగ్రహాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ దేనికి ఇష్టంవచ్చినట్లు ఆ రూపంలో తయారు చేయించుకుంటున్నాయి. కాకపోతే కొత్తగా ఇపుడు మొదలైన వివాదం మరీ విచిత్రంగా ఉంది. ఇంతకీ ఆ వివాదం ఏమిటంటే సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది తెలంగాణా తల్లి విగ్రహంకాదని సవతితల్లి విగ్రహం అని బీఆర్ఎస్(BRS) నేత ఆరోపించారు. దాంతో తెలంగాణా తల్లి విగ్రహంపై సరికొత్త వివాదం మొదలైంది. ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న తెలంగాణా తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ నేత సవతితల్లి విగ్రహంగా కామెంట్ చేయటంపై అధికారపార్టీ నేతలు మండిపోతున్నారు.

విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేడ్చల్(Medchal BRS Office) పార్టీ ఆఫీసులో తెలంగాణా తల్లి విగ్రమాన్ని ఎంఎల్సీ శంభీపూర్ రాజా తయారుచేయించారు. సొంతఖర్చులతో తయారుచేయించిన విగ్రహాన్ని తెలంగాణా ఏర్పాటైన కొత్తల్లో టీఆర్ఎస్(TRS) డిజైన్ చేయించిన పద్దతిలోనే రాజా తయారుచేయించారు. ప్రభుత్వం సచివాలయంలో ఏర్పాటుచేస్తున్న తెలంగాణా తల్లి విగ్రం డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరణ జరగబోతున్న విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ(Sonia Gandhi)ని పిలిపించాలని రేవంత్(Revanth) గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విష్కరణకు ఇంకా సమయం ఉంది కాబట్టి విగ్రహాన్ని ప్రభుత్వం బయటపెట్టలేదు. అయితే సోనియా రాక ఇంకా ఫైనల్ కాలేదు. కాబట్టి విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరిస్తారన్న విషయం సస్పెన్సులో ఉండిపోయింది.

ఇదే సమయంలో మేడ్చల్ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన తెలంగాణా తల్లి విగ్రహం ఆవిష్కరణ కూడా జరుగుతోంది. అంటే సచివాలయంలో ప్రభుత్వం తయారుచేయించిన విగ్రహం, మేడ్చల్ పార్టీ ఆఫీసులో రాజా తయారుచేయించిన విగ్రహం ఒకేరోజు ఒకే సమయంలో ఆవిష్కరణ అవుతున్నాయి. ఈ సందర్భంగా శంభీపూర్ రాజా మాట్లాడుతు ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న విగ్రహంపై చేసిన కామెంట్ వివాదాస్పదమైంది. ప్రభుత్వం తయారుచేయించింది తెలంగాణా తల్లి విగ్రహాన్ని కాదని సవతితల్లి విగ్రహాన్ని మాత్రమే అని రాజా అన్నారు. పొరుగురాష్ట్రాల్లో విగ్రహాలు బంగారు కిరీటాలు, నగలతో కనబడుతుంటే తెలంగాణా ప్రభుత్వం తయారుచేయించిన విగ్రహం మాత్రం బంగారు కిరీటం, నగలు లేకుండా పేదగా ఉండటం ఏమిటని నిలదీశారు. తెలంగాణా ఏర్పాటైన కొత్తల్లో తమపార్టీ తయారుచేయించిన తెలంగాణా తల్లి విగ్రహమే అసలైన విగ్రహమని రాజా ప్రకటించారు. మరి రాజా తాజా కామెంటుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More
Next Story