
నీరజ్ నీ విజయం దేశానికి గర్వకారణం
దోహో డైమండ్ లీగ్‌లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా సాధించిన విజయం పట్ల ఆయనను సీఎం చంద్రబాబు అభినందించారు.
ప్రపంచ ప్రతిష్టాత్మకమైన దోహా డైమండ్ లీగ్ టోర్నీలో 90 మీటర్ల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీజజ్ చోప్రా ప్రపంచ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా నీరజ్ చోప్రా విజయాన్ని పొగుడుతూ ఓ పోస్టు ప్టెట్టారు. నీరజ్ చోప్రా విజయం దేశానికే గర్వకారణమంటూ కొనియాడారు. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
.@Neeraj_chopra1 has once again etched his name in history by breaching the 90m mark at the Doha Diamond League 2025. Heartiest congratulations to him. This milestone symbolizes India's soaring sports ambition and Neeraj's unyielding spirit. Proud moment for the nation! 🇮🇳 pic.twitter.com/CLtudd9oyL
— N Chandrababu Naidu (@ncbn) May 17, 2025