అనుకున్నది సాధించిన పవన్ కల్యాణ్.. 62 మంది ఐఏఎస్‌ల బదిలీ
x

అనుకున్నది సాధించిన పవన్ కల్యాణ్.. 62 మంది ఐఏఎస్‌ల బదిలీ

ఏపీలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. తొలి విడతలో 32 మందిని బదిలీ చేసిన కూటమి సర్కార్ ఈసారి 62 మంది అధికారులను బదిలీ చేసింది.


ఏపీలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. తొలి విడతలో 32 మందిని బదిలీ చేసిన కూటమి సర్కార్ ఈసారి 62 మంది అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా కేరళ క్యాడర్‌లో పనిచేస్తున్న కృష్ణ తేజను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు రప్పించినట్లు వెల్లడించారు. కృష్ణతేజకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. ఎంవీ శేషగిరి రావును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా నియమించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణ తేజను ఆంధ్ర రప్పించడంలో పవన్ కల్యాణ్ తన పట్టు నిలబెట్టుకున్నారు. ఏది ఏమైనా కృష్ణ ఆంధ్రకు రావాలని, తన శాఖల్లో పనిచేయాలని పవన్ నిశ్చయించుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయగా పవన్ విజ్ఞప్తిని మోదీ సర్కార్ ఆమోదించింది. అనంతరం కృష్ణతేజను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల సర్దుబాటులో భాగంగా బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఐఏఎస్ అధికారులు కొత్త పోస్టింగ్‌లు

మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సి.హెచ్‌.శ్రీధర్‌

సి.హెచ్‌.శ్రీధర్‌కు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌లు ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరి

హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌గా రేఖా రాణి

ప్రజారోగ్యం, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌

నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ఎండీగాను హరికిరణ్‌కు అదనపు బాధ్యతలు

సెర్ప్‌ సీఈవోగా వీరపాండ్యన్‌

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌గా ఎం.హరినారాయణ

బీసీ సంక్షేమ డైరెక్టర్‌గా మల్లికార్జున

బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా మల్లికార్జునకు అదనపు బాధ్యతలు

సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్‌

భూ సర్వే, సెటిల్‌మెంట్‌ల డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు

సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎండీగా గిరిశ్ షా

ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీగా మంజీర్‌ జిలానీ

మంజీర్‌ జిలానీకి శాప్‌ ఎండీగా అదనపు బాధ్యతలు

ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికా శుక్లా

బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గాను కృతికా శుక్లాకు అదనపు బాధ్యతలు

ఎస్పీపీడీసీఎల్‌ సీఎండీగా రవి సుభాష్‌

ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా లక్ష్మీ షా

ఎన్టీఆర్‌ వైద్య సేవ సీఈవోగాను లక్ష్మీ షాకు అదనపు బాధ్యతలు

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ డైరెక్టర్‌గా ఎం.వేణుగోపాల్‌రెడ్డి

అల్లూరి జిల్లా జేసీగా అభిషేక్‌ గౌడ

మదనపల్లి సబ్‌ కలెక్టర్‌గా మేఘస్వరూప్‌

రాజంపేట సబ్‌కలెక్టర్‌గా వైకోమ్‌ నైదియాదేవి

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా కృష్ణ తేజ

ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా ఉన్న చక్రధర్‌బాబు బదిలీ

స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ఐజీ రామకృష్ణకు పోస్టింగ్‌ ఇవ్వని ప్రభుత్వం

కాకినాడ జేసీగా గోవిందరావు

కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎన్‌.తేజ్‌ భరత్‌

కె.ఆర్‌.పురం ఐటీడీఏ పీవోగా డి.హరిత

సీఆర్‌డీఏ అదనపు కమిషనర్లుగా సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, నవీన్‌

కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా భావన

నంద్యాల జేసీగా సి.విష్ణు చరణ్‌

ఎన్టీఆర్‌ జిల్లా జేసీగా నిధి మీనా

రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం

తిరుపతి జిల్లా జేసీగా శుభం భన్సల్‌

నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా మల్లవరపు సూర్యతేజ

సీతంపేట ఐటీడీఏ పీవోగా తాటిమాకుల రాహుల్‌కుమార్‌రెడ్డి

ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా నూరుల్‌ కమర్‌

శ్రీకాకుళం జేసీగా ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

కడప జేసీగా అదితి సింగ్‌

పార్వతీపురం ఐటీడీఏ పీవోగా మాధవన్‌

ఏలూరు జేసీగా పి.ధాత్రిరెడ్డి

అన్నమయ్య జిల్లా జేసీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌

గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా నవ్య

గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌గా దినేష్‌కుమార్‌

విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా ధ్యానచంద్ర

ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ సీఈవోగా ప్రవీణ్ ఆదిత్య

ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ ఆదిత్యకు పూర్తి అదనపు బాధ్యతలు

కోనసీమ జిల్లా జేసీగా నిశాంతి

తూ.గో జేసీగా హిమాన్షు కౌశిక్‌

గుంటూరు జేసీగా అమిలినేని భార్గవ తేజ

తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌గా నారపురెడ్డి మౌర్య

సీసీఎల్‌ఏ కార్యాలయం జాయింట్‌ సెక్రటరీగా శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌కుమార్‌

పల్నాడు జేసీగా సూరజ్‌ ధనుంజయ్‌

గిరిజిన కో-ఆపరేటివ్‌ ఎండీగా కల్పన కుమారి

రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌గా కేతన్‌ గార్గ్‌

ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పి.రాజబాబు

ఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్‌

క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీగా జి.సి. కిషోర్‌కుమార్‌

అగ్రికల్చర్‌ మార్కెట్‌ శాఖ డైరెక్టర్‌గా విజయసునీత

ఉద్యానశాఖ డైరెక్టర్‌గా కె.శ్రీనివాసులు

సాంఘిక, సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా లావణ్య వేణి

ఏపీఐఐసీ ఎండీగా అభిషిక్త్‌ కిషోర్‌

ఏపీటీడీసీ ఎండీగానూ అభిషిక్త్‌ కిషోర్‌కు అదనపు బాధ్యతలు

సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌గా ఏ.సిరి

ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి

కాడా కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి

ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ ఎండీగా కీర్తి చేకూరి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా గణేష్‌కుమార్‌

టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా గణేష్‌కుమార్‌

జీవీఎంసీ మున్సిపల్‌ కమిషనర్‌గా సంపత్‌కుమార్

Read More
Next Story