ఫెయింజల్ తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
విపతు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఫెయింజల్ తుపాన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్థేశం చేశారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతూ ఆ ప్రకారం ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ౖ అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. తుపాను కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా వాటి నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుపాన్‌పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సీఎం సూచించారు.