విజయవాడ ఫ్లడ్ అప్డేట్స్
x

విజయవాడ ఫ్లడ్ అప్డేట్స్

109 బోట్ల ద్వారా ఆహారం, మంచినీరు సరపరా. రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్లు


విజయ వాడ పరిసర ప్రాంతాలలో వరద బాధితులకోసం ప్రస్తుతం 109 బోట్ల ద్వారా ఆహారం, తాగునీటి సరఫరా చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలైన సింగ్ నగర్, రామలింగేశ్వర నగర్ తదితర ముంపు ప్రాంతాల నుండి 15 వేల మందికి పైగా నిరాశ్రయుల తరలించారు. వరద బాధితులకు నగరంలోని ప్రధాన కళ్యాణ మండపాలు, హోటళ్లలో ఆశ్రయం కల్పించారు. • నగరంలోని 49 ప్రాంతాల్లో 1,39,815 ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని అప్డేట్స్

• వరద సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన నేవీ హెలీకాప్టర్లు. ఇప్పటి వరకు నేవీ నుండి మూడు హెలీకాప్టర్లు రాక.
• హకింగ్ పేట ఎయిర్ బేస్ నుండి బయలు దేరిన మరో నాలుగు హెలీకాప్టర్లు.
• వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు చర్యలు
• ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేత
• నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు
• కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్లు, పునరుద్ధరణకు చర్యలు.
• ప్రకాశం బ్యారేజీ నుండి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం.
• వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.
• వరద బాధితులకోసం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 81 పునరావాస శిబిరాలు ఏర్పాటు.

• విజయవాడ నగరంలో నీటమునిగిన రవినగర్, వాంబేకాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో ఎంఐ-17 హెలీకాప్టర్ ద్వారా 3వేల కిలోలు, ఎఎల్-హెచ్ ద్వారా 2వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు జారవేత.

• వివిధ ప్రాంతాలనుంచి ఆహారాన్ని రప్పించి బాధితులకు చేరవేసే బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి జి.వీరపాండ్యన్ కు అప్పగింత.

• పొరుగు జిల్లాలైన బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలను పంపించాలని టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం.


Read More
Next Story