
తెలంగాణ టీచర్ ను ప్రశంసించిన ప్రధానమంత్రి
గిరిజన భాషలను కాపాడటంలో కైలాష్ తమకు చాలా సాయంచేశారని మోడీ కితాబునిచ్చారు.
తెలంగాణ టీచర్ ను నరేంద్రమోడీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతు ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ స్కూల్లో టీచర్ తొడసం కైలాష్ కు అభినందనలు తెలిపారు. ఎందుకంటే గిరిజన భాషలను(Tribal language) కాపాడటంలో కైలాష్ కృషి చేసినందుకు. గిరిజన భాషలను కాపాడటంలో కైలాష్ తమకు చాలా సాయంచేశారని మోడీ కితాబునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)(Artificial Intelligence) సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కైలాష్ కంపోజ్ చేసిన తీరును ప్రధానమంత్రి కొనియాడారు. ఈమధ్యనే తాను ఏఐ సదస్సులో పాల్గొనేందుకు ప్యారిస్(Paris) వెళ్ళిన విషయాన్ని మోడీ(Narendra Modi) గుర్తుచేశారు. ఏఐ రంగంలో భారత్(India) సాధించిన విజయాలను ప్రపంచం ప్రశంసించినట్లు మోడీ చెప్పారు.
తర్వాత ఇస్రో(ISRO) 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం అవటం దేశనికే గర్వకారణమన్నారు. పదిసంవత్సరాల్లో దాదాపు 460 ఉపగ్రహాలను ఇస్రో లాంచ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రయాన్(Chandrayan) విజయం దేశానికి ఎంతో గర్వకారణమని చెప్పారు. అంతరిక్షం, ఏఐ ఇలా ఏ రంగమైనా మహిళల భాగస్వామ్యం పెరుగుతోందన్నారు. జాతీయమహిళాదినోత్సాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్పూర్తి నింపేందుకు ఏదో ఒకరోజు తన సోషల్ మీడియా ఖాతాను మహిళలకు అంకితంచేస్తానని మోడీ ప్రకటించారు.