మా స్టేట్.. పెట్టుబడులకు ఎస్టేట్!!
x

మా స్టేట్.. పెట్టుబడులకు ఎస్టేట్!!

పెట్టుబడిదారులకు వినూత్నంగా ఆహ్వానిస్తున్న నారా లోకేశ్


పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఇవాళ ముంబాయిలో టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో నవంబర్ లో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని టాటా గ్రూపు ప్రతినిధులను ఆహ్వానించారు. ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూపు భాగ‌స్వామ్యం కావాల‌ని, అన్ని రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్ ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, రూఫ్‌టాప్‌ సోలార్‌ అభివృద్దిలో కలిసి పనిచేయాలని, సెల్‌, మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో టాటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని, పలు రంగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు ఈ సందర్భంగా కోరారు. శ్రీసిటీలో ఈవీ భాగాలు తయారీ యూనిట్లు స్థాపించాలని కోరారు. భూమి, ప్లగ్‌ అండ్‌ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, ప్రత్యేక ప్రోత్సాహకాలను సైతం ఇస్తుందని భరోసా ఇచ్చారు.
శ్రీసిటీలో ఇంజినీరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కూడా మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించాలని కోరిన ఆయన.. టాటా ఎలక్ట్రానిక్స్‌ ఆధ్వర్యంలో ఓఎస్‌ఏటీ ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఏపీ సముద్ర ఎగుమతుల కోసం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణం, పోర్టు ఆధారిత లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారికి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
Read More
Next Story