చదరంగంలో తొమ్మిదేళ్ల నారా దేవాన్ష్‌ వరల్డ్‌ రికార్డ్‌
x

చదరంగంలో తొమ్మిదేళ్ల నారా దేవాన్ష్‌ వరల్డ్‌ రికార్డ్‌

చదరంగంలో పావు వేగంగా కదపడం అంత సులువు కాదు. కేవలం తొమ్మిదేళ్లకే వేగంగా పావులు కదిపి ప్రపంచ రికార్డును సృష్టించారు నారా దేవాన్ష్‌.


ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ కుమారుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనవడు, నారా దేవాన్ష్‌ వేగాన్ని ఒడిసి పట్టుకున్నారు. చదరంగంలో వేగవంతమైన ‘చెక్‌మేట్‌ సాల్వర్‌–175 పజిల్స్‌’ ప్రపంచ రికార్డు దేవాన్ష్‌ కైవసం చేసుకున్నారు. 9 ఏళ్లకే చెస్‌లో వేగవంతంగా పావులు కదపడంలో 175 పజిల్స్‌లో విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన వరల్ట్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ నుంచి అధికారిక ధృవీకరణ ప్రతాన్ని ఆ మేరకు దేవాన్ష్‌ అందుకున్నారు. దేవాన్ష్‌ లేజర్‌ షార్ప్‌ ఫోకస్‌లో శిక్షణ పొందారు. ఈ శిక్షణను తాను ప్రత్యక్షంగా చూశానని, తండ్రి లోకేష్‌ అంటూ దేవాన్ష్‌ సాధించిన ఘనతపై హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్‌ చెస్‌ క్రీడను ఎంతో ఇష్టంగా ఆడతారు. గ్లోబల్‌ అరేనాలో భారతీయ చెస్‌ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మకమైన ప్రదర్శనలను చూసి, ప్రేపేరణలు పొందినట్లు లోకేష్‌ తెలిపారు. ఈ ఈవెంట్‌ కోసం కొన్ని వారాలుగా, రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు శిక్షణ తీసుకున్నాడని, చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్‌ చెస్‌ అకాడమీ వారికి లోకేష్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. దేవాన్ష్‌ చెస్‌ క్రీడలో డైనమిక్‌గా తయారవుతాడని, కోచ్‌ కే రాజశేఖరరెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ను చాకచక్యంతో పరిష్కరించ గలిగిన మానసిక చురుకు దనం దేవాన్ష్‌ సొంతమన్నారు. చదరంగ క్రీడలో ఒక మైలు రాయి అని దేవాన్ష్‌ను కోచ్‌ రాజశేఖర్‌ కొనియాడారు.

Read More
Next Story