చంద్రబాబు నామినేషన్ వేసిన భువనేశ్వరి!
x

చంద్రబాబు నామినేషన్ వేసిన భువనేశ్వరి!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నామినేషన్‌ను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు దాఖలు చేశారు.


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నామినేషన్‌ను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు దాఖలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారికి చంద్రబాబు నామినేషన్ పత్రాలను ఆమె అందించారు. ఇందుకోసం ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆమె కుప్పం మున్సిపాలిటీ 25వ వార్డులో ఉణ్న వ్రీ ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులుకు ఇచ్చారు. ఈ సందర్బంగానే చంద్రబాబు రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆమె కోరారు. చంద్రబాబు నామినేషన్‌కు అవసరమైన నగదును ఆమె మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వికలాంగులు, రైతులకు విరాళంగా అందించారు.

Read More
Next Story