అన్యాయంగా నా కుమారుడిని అరెస్ట్‌ చేశారు: మాజీ మంత్రి విశ్వరూప్‌
x

అన్యాయంగా నా కుమారుడిని అరెస్ట్‌ చేశారు: మాజీ మంత్రి విశ్వరూప్‌

రాజకీయ కక్షతో తన కుమారుడిని హత్య కేసులో ఇరికించారని, తన కుమారుడి అరెస్టు అక్రమమని మాజీ మంత్రి పినేపి విశ్వరూప్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


తన కుమారుడి అరెస్టు అక్రమమని, అన్యాయంగా అరెస్టు చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని మండిపడ్డారు. కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి సర్కార్‌ ఆజ్యం పోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విశ్వరూప్‌ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి అక్రమ అరెస్టును విశ్వరూప్‌ తీవ్రంగా ఖండించారు.

కావాలనే నా కుమారుడిని హత్య కేసులో ఇరికించారని, హత్య కేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. చనిపోయిన వ్యక్తి తమ పార్టీ కార్యకర్తేనని, ఎఫ్‌ఐఆర్‌లో తన కొడుకు పేరు ఎక్కడా లేదన్నారు. అక్రమంగా నా కుమారుడిని అరెస్ట్‌ చేశారని అన్నారు. రాజకీయ కక్షతో నిందితులతో తన కొడుకు పేరు చెప్పించి తప్పుడు కేసు పెట్టారని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని విమర్శించారు. కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి ప్రభుత్వం ఆజ్యం పోస్తోందన్నారు. మధురై ఆలయ సందర్శనకు వెళ్లి వస్తున్న సమయంలో నా కుమారుడిని అరెస్టు చేశారు అని చెప్పారు. న్యాయస్థానాలపై మాకు అపారమైన నమ్మకం ఉందని విశ్వరూప్‌ అన్నారు.
Read More
Next Story