సీఎం భార్య ఆధ్వర్యంలో మ్యూజిక్‌ నైట్‌..రోగులకు సాయం
x

సీఎం భార్య ఆధ్వర్యంలో మ్యూజిక్‌ నైట్‌..రోగులకు సాయం

సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ బృందంతో విజయవాడలో ఫిబ్రవరి 15న మ్యూజిక్‌ నైట్‌ నిర్వహిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తలసేమియా రోగులను ఆదుకునేందుకు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ మ్యూజిక్‌ నైట్‌ను నిర్వహించి తద్వారా వచ్చే ఆదాయాన్ని తలసేమియా రోగులకు చికిత్సలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా ఫిబ్రవరి 15న విజయవాడలోని ఇందిరా గాంధి మునిసిపల్‌ స్టేడియంలో మ్యూజిక్‌ నైట్‌ను నిర్వహించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎస్‌ ఎస్‌ తమన్‌ బృందం ఈ కార్యక్రమంలో ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి టికెట్లు చెల్లించన వారికి పాస్‌లు జారీ చేస్తారు. పాస్‌లు ఉన్న వారినే లోని అలౌ చేస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నారా భువనేశ్వరి శుక్రవారం పరిశీలించారు. స్టేడియంలో ఏర్పాటు చేసే బ్లాక్‌లు, వీవీఐపీలు, ప్రజలు వచ్చే ఎంట్రీ పాయింట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి సంబంధించిన అరేంజ్‌మెంట్స్, సెక్యురిటీ ఏర్పాట్లు వంటి అంశాలపై విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు ఆమెకు వివరించారు. పాస్‌లు ఉన్న వారినే లోపలికి అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని నారా భువనేశ్వరి సీపీకి సూచించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ యుఫోరియా మ్యూజిక్‌ నైట్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో సంగీత దర్శకులు తమన్‌ పాల్గొంటారని చెప్పారు. ఈ మ్యూజికల్‌ నైట్‌ను వీక్షించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అందరూ రావాలని కోరారు. ప్రేక్షకులు కొనుగోలు చేసే డబ్బుతో తలసేమియా రోగులకు సాయం అందిస్తామని, దీని కోసం ఐదు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో సెంటర్‌ ఏర్పాటుకు రూ. 60 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. బ్లడ్‌ ట్రాన్స్‌ మీట్, మందులు ఇప్పటికే అందిస్తున్నామని, రక్తం, మందులకు చాలా ఖర్చు అవుతుందని, దీనికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు.
Read More
Next Story