పెళ్లయిన 8 నెలలకే 7 నెలల గర్భిణీ అనే అనుమానంతోనే అనిత హత్య?
x
వాసు, అనిత (పాత చిత్రం)

పెళ్లయిన 8 నెలలకే 7 నెలల గర్భిణీ అనే అనుమానంతోనే అనిత హత్య?

విశాఖపట్నంలో దంపతుల మృతిపై పోలీసుల విచారణ


వాళ్లిద్దరికి పెళ్లై 8 నెలలైంది. అంతా సవ్యంగానే సాగుతోంది. ఇంతలో కట్టుకున్నోడికి అనుమానపు తెగులు పుట్టింది. పెళ్లయిన 8 నెలలకే 7 నెలల గర్భిణీ ఎలా వచ్చిందని ఎవరో అడిగిన దాన్ని మనసులో పెట్టుకుని భార్యను వేధించడం ప్రారంభించాడు. అసలు నిజమేమిటో చెప్పమంటూ ఇంట్లో రచ్చ మొదలుపెట్టాడు. ఆమె ఎంత నచ్చచెప్పాలని చూసినా మగాడి అనుమానం మకెల వదల్లేదు.. చివరకు ఆమెను కడతేర్చి తనూ ఉరేసుకుని చనిపోయాడు.
అసలేం జరిగిందంటే...
విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఉండే సూరిశెట్టి వాసు, ఆయన భార్య అనిత మృతి నగరంలో కలకలం రేపింది. కొత్తగా పెళ్లయిన ఈ దంపతులు ఎందుకు చనిపోయారనే దానిపై ఆ ప్రాంతంలో కలకలం రేపింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలు మిస్టరీని ఛేదించారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. భార్యపై అనుమానంతో భర్త గొంతు నులిమి చంపేసినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. అక్కయ్యపాలెం ‘సంగం ఆఫీసు’ సమీపంలో సూరిశెట్టి వాసు, ఆయన భార్య అనిత అతని తల్లితో కలిసి నివాసముంటున్నాడు. 8 నెలల కిందట వీళ్లకు పెళ్లి అయింది.
అనిత ఇప్పుడు 7 నెలల గర్భిణి. పెళ్లయిన నెలకే గర్భిణీ రావడంపై వాసుకు అనుమానం మొదలైంది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు కూడా ప్రారంభమయ్యాయి. నెల రోజుల నుంచి అనితను వాసు అనుమానించడం మొదలు పెట్టినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఈనేపథ్యంలో వాసు ఆదివారం ఉదయం తన తల్లిని తీసుకుని మధురవాడలోని బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్లాడు. ఆ తర్వాత తల్లిని అక్కడే వదిలేసి తిరిగి ఇంటికొచ్చేశాడు.

ఏదో అనుమానాన్ని శంకించిన వాసు తల్లి మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత అనితకు ఫోన్ చేసి విషయం కనుక్కుంది. అంతా బాగానే ఉన్నట్లు అనిత చెప్పింది. సాయంత్రం 6 గంటల సమయంలో వాసు తల్లి ఇంటికొచ్చింది. తలుపు తట్టింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది.
పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అనిత కిందపడి చనిపోయి ఉంది. వాసు ఉరేసుకుని కనిపించారు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అనిత శరీరంపై గోళ్ల గాట్లు ఉన్నాయి. దుప్పటితో అనిత గొంతు బిగించి ఊపిరాడకుండా చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అనిత చనిపోయిందన్న భయంతోనే వాసు కూడా ఉరేసుకొని చనిపోయి ఉండవచ్చునని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.
కాగా, అనిత ఏడు నెలలు గర్భిణి కావడంతో కడుపులో ఉన్న బిడ్డను బతికించేందకు పోలీసులు ఆమె మృతదేహాన్ని స్థానిక కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గర్భంలో ఉన్న ఆడ శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Read More
Next Story