కొడుకు గొంతు కోసి..తన గొంతు కోసుకున్న తల్లి
x

కొడుకు గొంతు కోసి..తన గొంతు కోసుకున్న తల్లి

కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రాణాలు తీసుకున్న వైనం.


అనంతపురం నగరం శారదానగర్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్ భార్య అమూల్య (32) తన 5 ఏళ్ల కుమారుడు సహర్ష్ గొంతు కోసి, అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన సమయంలో ఇంట్లో రవికుమార్ లేడు. రాత్రి ఇంటికి వచ్చిన ఆయనకు భార్య, కుమారుడు రక్తమొబ్బెల్లో పడి ఉండటం చూసి కుప్పకూలిపోయాడు. వెంటనే పొరుగువారికి సమాచారం ఇవ్వగా, ఒకటో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయాలు

  • భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా కుటుంబ కలహాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
  • ఆ కలహాలే ఈ దారుణానికి ప్రధాన కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
  • ఇంట్లో ఉన్న ఒక కత్తితోనే ఈ దారుణం జరిగినట్లు గుర్తించారు.

మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ కలహాలు ఇంత దారుణానికి దారి తీయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Read More
Next Story