విజయవాడలో భారీ వర్షంలోనూ దోమ కాటు
x
బాలాజీ నగర్లో భారీ వర్షం

విజయవాడలో భారీ వర్షంలోనూ దోమ కాటు

బుధవారం ఉదయం నుంచి విజయవాడ నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య భారీ వర్షం కురిసింది.


ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DES-AP) డేటా ప్రకారం, విజయవాడ నగరంలో సెప్టెంబర్ 17, 2025 (బుధవారం) రాత్రి కురిసిన వర్షం వివిధ స్టేషన్లలో వర్షపాతం వేర్వేరుగా నమోదైంది. విజయవాడ సెంట్రల్ ప్రాంతంలోని A.K.T.P.M.C హైస్కూల్ స్టేషన్‌లో 34.5 మి.మీ., పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్‌లో 21 మి.మీ. వర్షం కురిసింది. ఇతర ప్రాంతాల్లో 1-5 మి.మీ. మధ్యలో ఉంది. ఈ డేటా రాత్రి 10 గంటల వరకు (22:00) నమోదైనది, కాబట్టి రాత్రి వర్షాన్ని ఈ సమాచారం కవర్ చేస్తుంది.

ఒకవైపు భారీ వర్షం కురుస్తుంటే మరో వైపు ఇండ్లలో దోమలు స్వైర విహారం చేశాయి. ద్వారం తెరవగనే కుప్పలుగా ఇండ్లలోకి దోమలు వచ్చాయి. ఇంత భారీ మొత్తంలో ఎప్పుడూ దోమలు చూడలేదని విజయవాడ రామలింగేశ్వర నగర్ కు చెందిన దిరిశన గంట్ల కృష్ణ అన్నారు. ఒక వైపు వర్షం, మరో వైపు దోమలు బుధవారం రాత్రి విసుగు పుట్టించాయని ప్రజలు వాపోయారు.

ఈ వర్షం వల్ల పెద్దగా నష్టం జరిగినట్లు రిపోర్టులు లేవు. కానీ భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులపై నీరు నిలిచి, జలమయమైంది. సర్వీస్ రోడ్లలో నీరు పూర్తి స్థాయిలో నిలిచి పోయింది. ప్రధాన రహదారులపై నీరు కొద్దిసేపు నిల్వ ఉన్నా తర్వాత రెయిన్ వాటర్ కాలువల నుంచి డ్రైనేజీలో కలిసి బయటకు పోయింది. ఇది ట్రాఫిక్ జామ్‌లు, వాహనాలు నిలిచిపోవడం వంటి సమస్యలకు దారితీసింది.

వర్షం వల్ల రోడ్లు చెరువుల్లా మారడంతో ప్రజలు ప్రయాణాల్లో ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో వీధుల్లో నీరు నిలిచి, వాహనాలు, పాదచారులు కష్టపడ్డారు. అయితే ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇది సాధారణ మాదిరిగానే స్థానిక వర్షపాతం వల్ల వచ్చిన తాత్కాలిక ఇబ్బందులు. IMD ప్రకారం, కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో ఐసోలేటెడ్ ప్లేసెస్‌లో హెవీ రెయిన్ (7-11 సెం.మీ.) నమోదైంది, కానీ విజయవాడలో మోడరేట్ రేంజ్‌లో ఉంది.
ఒక్కసారిగా ఉన్నట్లుండి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో కుండ పోత వర్షం కురిసింది. విచిత్రం ఏమిటంటే ఒకచోట కుండ పోత వర్షం కురిస్తే మరో చోట అసలు వర్షమే లేదు. వర్షం కురిసిన ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఈదురు కాలుగు వీచాయి. బయటకు వచ్చిన ప్రజలు మెరుపులు, ఉరుములకు భయ భ్రాంతులయ్యారు. బెంజ్ సర్కిల్, వారది, రామలింగేశ్వర నగర్, బందర్ రోడ్డు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఇండ్లలో కాస్త ఉక్కపోత ఏర్పడింది. దోమలు కుప్పలు తెప్పలుగా ఇండ్లలోకి వచ్చాయి. ఇంటి మెయిన్ డోర్ తెరవడంతోనే దోమలు ఇంట్లోకి దూకాయి. చాలా ఇండ్లలో ఇదే పరిస్థితి ఎదురైంది. రాణీగారి తోట, బాలాజీ నగర్, రామలింగేశ్వర నగర్, బందర్ రోడ్డు, హైస్కూలు రోడ్డు, పంటకాలువ రోడ్డు, కృష్ణలంక, కృష్ణలంక రైతు బజారు, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో దోమలు కుప్పలుగా జనంపైకి ఎగబడ్డాయి. ఇంత భారీ స్థాయిలో దోమలు ఎక్కడి నుంచి వచ్చాయోనని జనం హడలిపోయారు.
Read More
Next Story