మోపిదేవి అన్నా.. నీకేమి తక్కువ చేశాను: జగన్‌
x

మోపిదేవి అన్నా.. నీకేమి తక్కువ చేశాను: జగన్‌

మోపిదేవి వెంకటరమణకు ఎక్కడా, ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఈ సారి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే రాజ్య సభకు రీ నామినేట్‌ చేసే వాడిని.


ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోపిదేవి అన్నకు ఎక్కడా అక్కవ చేయలేదన్నారు. తాడేపల్లి జగన్‌ నివాసంలో జరిగిన రేపల్లె అసెంబ్లీ నియోజక వర్గం సమీక్ష సమావేశంలో మోపిదేవి వెంకటరమణ గురించి జగన్‌ మాట్లాడుతూ..

మోపిదేవి అన్నను మొట్ట మొదటి సారిగా తన క్యాబినెట్‌లోకి తీసుకున్నాను. ఓడి పోయినా కూడా మోపిదేవి అన్నను నా క్యాబినెట్లోకి తీసుకున్నాను. మంత్రి పదవి ఇచ్చి ఆయనను గౌరవించాను. వైఎస్‌ఆర్‌సీపీ 151 స్థానాలు గెలిచినప్పుడు కూడా ఆయన గెలవ లేదు. ఓడిపోయిన 24 స్థానాల్లో మోపిదేవి రమణ అన్న స్థానం ఉంది. అయినా నేను మోపిదేవి అన్నను మరిచి పోలా. తర్వాత మళ్లీ మండలిని రద్దు చేయాలని అనుకున్నప్పుడు, రద్దు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, వీరి ఎమ్మెల్సీ పదవులు పోతాయని ఆలోచనలు చేసి రాజ్య సభకు పంపేందుకు కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఆ మాట ఆయనకు చెబితే నన్ను ఇప్పుడే రాజ్య సభకు పంపించాలని అన్నారు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడే రాజ్య సభకు కూడా పంపించాను.
మొట్ట మొదటి సారిగా ఒక మత్స్యకారుడిని రాజ్య సభకు పంపించిన పాలన కూడా జరిగిందీ అంటే అది మన వైఎస్‌ఆర్‌సీపీ పాలనలోనే అని జగన్‌ మాట్లాడారు. ఎక్కడా కూడా మోపిదేవి అన్నకు తక్కువ చేయలేదన్నారు. రాజ్య సభకు పంపించిన తర్వాత ఆయన పదవిలో ఉండగానే గణేష్‌కు రేపల్లె ఎమ్మెల్యేగా టిక్కెట్‌ ఇచ్చాం. ఈ సారి మనం గెలిచి ఉండి ఉంటే మళ్లా మోపిదేవి అన్నకు రాజ్య సభకు రీ నామినేట్‌ చేసుండే వాళ్లం. ఎక్కడా కూడా మనం తప్పు చేయలేదు. మంచికి ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా మంచి చేసే మనసు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తోడుగా నిలబడుతాడని మాట్లాడారు.
Read More
Next Story