
మొంథా ఎఫెక్ట్..పోర్టులకు ప్రమాద హెచ్చరికలు
మత్స్యకారులకు, షిప్పింగ్ కంపెనీలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన ‘మొంథా’ (Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పోర్టులను అప్రమత్తం చేశారు. భారత వాతావరణ శాఖ (IMD) విశాఖపట్నం సైక్లోన్ హెచ్చరిక కేంద్రం ప్రకారం, తుపాను మంగళవారం (అక్టోబర్ 28, 2025) సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో (మచిలీపట్నం-కళింగపట్నం మధ్య) తీరం దాటనుంది. ఈ సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన గాలులు, 1-2 మీటర్ల ఉప్పెన (storm surge), అతి భారీ వర్షాలు (20-40 సె.మీ.) సంభవించనున్నాయి. ఇవి పోర్టు కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. మత్స్యకారులు, షిప్పింగ్ కంపెనీలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తీర ప్రాంత పోర్టుల్లో షిప్ మూవ్మెంట్స్ నిలిపివేసి, సురక్షిత చర్యలు తీసుకుంటున్నారు.
ప్రధాన పోర్టుల వారీగా ప్రమాద హెచ్చరికలు (IMD & పోర్టు అధికారుల ప్రకారం):
- కాకినాడ పోర్టు (Kakinada Port): తుపాను తీరం దాటే ప్రధాన ప్రదేశంలో ఉండటంతో డేంజర్ సిగ్నల్ నెంబర్ 7 ను జారీ చేశారు. ఇది తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తుంది. షిప్ మూవ్మెంట్స్ అన్నీ పూర్తిగా నిలిపివేశారు. గాలులు 100+ కి.మీ/గం వేగంతో వీస్తాయి. ఉప్పెనతో డాక్‌లు మునిగే అవకాశం ఉంది. పోర్టు కార్యకలాపాలను పూర్తిగా క్లోజ్ చేశారు.
- విశాఖపట్నం పోర్టు (Visakhapatnam Port): డేంజర్ సిగ్నల్ నెంబర్ 6 జారీ చేశారు. తుపాను 340 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ, బలమైన గాలులు (70-90 కి.మీ/గం), అతి భారీ వర్షాలు, 2-4 మీటర్ల తరంగాలు ప్రభావితం చేస్తాయి. కంటైనర్ ఓపరేషన్స్, క్రూజ్ షిప్స్ నిలిపివేశారు. రెడ్ అలర్ట్‌తో NDRF బృందాలు మోహరించాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్స్ క్యాన్సల్ అయ్యాయి.
- మచిలీపట్నం పోర్టు (Machilipatnam Port): డేంజర్ సిగ్నల్ నెంబర్ 6 హోయిస్ట్ చేశారు. తుపాను తీరం దాటే ప్రదేశంలో ఉండటంతో గాలులు 90-110 కి.మీ/గం, ఉప్పెన 1.5 మీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. షిప్ ట్రాఫిక్ పూర్తి ఆగిపోయింది. కృష్ణా జిల్లా రెడ్ అలర్ట్‌లో ఉంది. వరదలు, మునిగిపోవడం వంటి ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. అధికారులు అప్రమత్తమయ్యారు.
- కృష్ణపట్నం పోర్టు (Krishnapatnam Port, SPSR నెల్లూరు): డేంజర్ సిగ్నల్ నెంబర్ 5 జారీ చేశారు. రెడ్ అలర్ట్‌తో భారీ వర్షాలు (15-25 సె.మీ.), గాలులు 70-90 కి.మీ/గం వీచే అవకాశాలు ఉన్నాయి. షిప్ ల ఆపరేషన్స్ సస్పెండ్ చేశారు. సముద్రంలోకి వెళ్లడాన్ని నిలిపి వేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఫ్లడింగ్ ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.
- అన్ని పోర్టుల్లో షిప్స్ హార్బర్‌లో కార్యకలాపాలను నిలిపి వేశారు. మత్స్యకారులు అక్టోబర్ 29 వరకు సముద్రంలోకి వెళ్లవద్దు ని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. SDRF/NDRF బృందాలు మోహరించాయి. పోర్టు కంట్రోల్ రూమ్‌లు 24/7 యాక్టివ్ లో ఉంటాయి. ప్రాణ-ఆస్తి రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. పోర్టు ప్రాంతాల్లో ఉన్నవారు అధికారుల సూచనలు పాటించి, బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
Next Story

