
శ్రీశైల పాతాళగంగ మెట్ల మార్గంలో విరిగిపడిన కొండ చరియలు
మొంథా తుఫాను ప్రభావం, మూడు షాపులు ధ్వంసం
నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో మొంథా తుఫాను ప్రభావం తీవ్రస్థాయిలో కనబడుతుంది. శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో జనజీవనం స్తంభించింది.
శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనితో మూడు షాపులు ధ్వంసం అయ్యాయి. భారీగా కొండ చరియలు విరిగి పడుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
కార్తీక మాసం సందర్భంగా దర్శనానికై క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గదులకే పరిమితమయ్యారు. దీనితో ప్రమాదం తప్పింది.
అంతేకాకుండా వరద నీరు దిగువకు నది వలే ప్రవహిస్తూ ఉండడంతో ఇళ్ల ముందు ఉన్న మట్టి రోడ్డు కాస్త కోతకు గురవుతున్నాయి. ఇలాగే కొనసాగితే పాతాళగంగ మెట్ల మార్గంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం మరో రెండు రోజులు ఉన్న నైపద్యంలో క్షేత్రానికి వస్తున్న భక్తులు తగిన జాగ్రత్తలతో ఉండాలని అధికారులు చెప్తున్నారు.

