మొంథా తుపాను ప్రభావం వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూలిన చెట్లు తొలగించేందుకు 1040 యాంత్రిక రంపాలను అందుబాటులో ప్రభుత్వం ఉంచింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకూ 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా సంక్షిప్త సమాచారం ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. వర్ష ప్రభావం రీత్యా 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం సిద్ధం చేసింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్ల పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేశారు. 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా ప్రభావితం అయినట్టు అంచనా వేస్తున్నారు.

మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 4 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలు
నెల్లూరు జిల్లా ఉలవపాడు 12.6 సెంటిమీటర్లు
సింగరాయకొండ 10.5 సెంటీమీటర్లు
కావలి 12.2 సెంటిమీటర్లు
దగదర్తి 12 సెంటిమీటర్లు
బి.కోడూరు 6 సెంటిమీటర్లు
కళింగపట్నం 7 సెంటిమీటర్లు
విశాఖ 2 సెంటిమీటర్లు
తుని 2 సెంటిమీటర్లు