
మోదీ టూర్–ఏర్పాట్లు పూర్తి అయినట్లే
మంత్రి నారాయణ, అధికారులతో కలిసి ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మే2న అమరావతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో నిర్వహిస్తున్న బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను అధికారులతో కలిసి బుధవారం ఉదయం మంత్రి నారాయణ పరిశీలించారు. బుధవారం సాయంత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తి అవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు.
అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు, రోడ్‌షోలకు వచ్చే ప్రజలు, కూటమి శ్రేణులకు అవసరమైన రవాణా, వాహనాల పార్కింగ్ అనేది చాలా కీలకమని, దానికి సంబందించిన ఏర్పాట్లు దగ్గరుండి మరి పరిశీలిస్తున్నామన్నారు. ఒక వేళ్ల వర్షం వచ్చినా కూడా సభ సజావుగా సాగేందుకు, వాహనాల పార్కింగ్‌లకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని సీఎం సూచించారని, ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
సభకు తరలి వచ్చే వారి వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దాదాపు 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశారని వెల్లడించారు. 5 లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్ కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. 6500 –7000 బస్సులు, 3000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు.
Next Story