కశ్మీర్‌ బాధ గుండెల్లో ఉన్నా మోదీ అమరావతి వచ్చారు
x

కశ్మీర్‌ బాధ గుండెల్లో ఉన్నా మోదీ అమరావతి వచ్చారు

మరో సారి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబును తనదైన శైలిలో పొగడ్తలతో ముంచెత్తారు.


కశ్మీర్‌లో దారుణంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 27 మంది భారతీయులు చనిపోయారు. ఇది దేశాన్ని కలిచివేసింది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో బాధ ఉంది. ఎంతో ఆవేదన ఉంది. ఈ దుర్ఘటనతో ప్రధాని మోదీ ఎంతో వేదనకు గురయ్యారు. అయినా ఆ బాధలను, ఆ వేదనలను ప్రధాని మోదీ తన గుండెల్లోనే దిగమింగుకున్నారు. భారత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశ ఇంటిగ్రిటీని చాటి చెబుతున్నారు. అంతటి తీవ్ర దుఃఖాన్ని తన గుండెల్లో దిగమింగుకొని అమరావతికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల కోసం, అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని గుర్తించి ఇక్కడకు వచ్చారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అమరావతిపై ప్రధాని మోదీకి ఉన్న ఇష్టానికి నిదర్శనం అన్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం సభలో శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులను ప్రత్యేకంగా అభినందించారు. ఒక్క పిలుపుతో వేలాది ఎకరాలను రాజధానికి భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి కృత్ఞతలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు వంచి నమస్కారం చెప్పారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, రాష్ట్రానికి భవిష్యత్‌ను ఇచ్చారని అన్నారు. గత ఐదేళ్లలో జరిగిన ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం బాధ్యులుగా ఉంటుందన్నారు. రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించి రైతల రుణం తీర్చుకుంటామన్నారు.
అమరావతి గురించి మాట్లాడే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమయ్యే విధంగా ఇంగ్లీషులో మాట్లాడారు. మరో సారి చంద్రబాబు ను పవన్‌ కల్యాణ్‌ పొగడ్తలతో ముంచెత్తారు. అమరావతి శిల్పి, సైబరాబాద్‌ రూకర్త, గొప్ప పాలన దక్షుడు అంటూ ఓ రేంజ్‌లో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.
కశ్మీర్‌ ఉగ్ర దాడి జరిగిన వాతావరణంలో భాతరం దేశం ఉన్నప్పటికీ, ఆ బాధలన్నింటినీ తన గుండెల్లో దిగమింగుకొని అమరావతికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ భవానీ అమ్మవారి ఆశిస్సులు ప్రధాని నరేంద్ర మోదీకి ఉండాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో దూసుకొని పోతుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.
Read More
Next Story