మాక్ అసెంబ్లీ..అదరగొడుతున్న విద్యార్థులు
x

మాక్ అసెంబ్లీ..అదరగొడుతున్న విద్యార్థులు

రాజ్యాంగ దినోత్సవ ఉత్సాహం సందర్బంగా విద్యార్థుల చేత మాక్ అసెంబ్లీ నిర్వహించారు.


రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించేందుకు 'మాక్ అసెంబ్లీ'ను ఘనంగా నిర్వహిస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు (నవంబర్ 26, 2025) ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 175 నియోజకవర్గాల నుంచి ఎంపికైన విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాస రచనలు, క్విజ్‌ల ద్వారా ఎంపికైన ఈ విద్యార్థులు స్పీకర్, మంత్రులు, లెజిస్లేచర్లుగా వ్యవహరిస్తూ సమావేశాలను తామే నడుపుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరై, విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 'చిల్డ్రన్స్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా'ను లాంచ్ చేశారు.

మాక్ అసెంబ్లీలో పాల్గొనే విద్యార్థులలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని కుర్మల కనకపుట్టులమ్మ (Kurmala Kanakaputtulamma)ను మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ బాలిక బీ.ఆర్. నగర్ మున్సిపల్ హై స్కూల్‌లో చదువుతోంది. లోకేష్ ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతూ, రాజ్యాంగం హక్కులతో పాటు కర్తవ్యాల గురించి మార్గదర్శకత్వం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్‌డే మీల్స్, విద్యా సౌకర్యాలను అందిస్తున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులుగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడం, రాజ్యాంగ ఆశయాలు ప్రజల్లోకి ప్రవేశపెట్టడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

Read More
Next Story