జనసేన కార్యకర్తలకు నాగబాబు బంపర్ ఆఫర్
x

జనసేన కార్యకర్తలకు నాగబాబు బంపర్ ఆఫర్

ఎమ్మెల్సీ నాగబాబు జనసేన కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు. మున్ముందు బోలెడన్ని నామినేటెడ్ పదవులు రాబోతున్నాయని తేల్చిచెప్పారు


జనసేన కార్యకర్తలకు నాగబాబు బంపరాఫర్ ఇచ్చారు. పదవులు రాక ధర్నాలకు దిగిన జనసేన కార్యకర్తలకు ఇది నిజంగా శుభవార్తే.పదవుల కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు వీధి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని కూడా నాగబాబు చెప్పారు. వాస్తవానికి ఇదో హెచ్చరిక లాంటి శుభవార్త. నేను ఉత్తరాంధ్రలోనే ఉంటా. పార్టీని బలోపేతం చేస్తా. నెలలో ఐదు నుంచి పది రోజుల పాటు ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలను కలుస్తా. అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. దామాషా ప్రకారం జనసేనకు నామినేటెడ్ పదవులు వస్తాయి. మరి కొద్దిరోజుల్లో జనసేన సభ్యత్వ నమోదు జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలను పార్టీలో చేర్చాలి అని నాగబాబు చెప్పారు.విశాఖపట్నంలో ఇవాళ పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ పదవిని చేపట్టారు. త్వరలో మంత్రి కూడా అవుతారని చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఏమన్నారంటే... తనకు పదవులపై ఆశ లేద‌న్నారు. డ‌బ్బుపై అస‌లు ఆశే లేద‌న్నారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌గా వుండ‌డ‌మే త‌న‌కు ఇష్ట‌మ‌న్నారు. ఆయన ఇప్పుడు ఆ మాటలు ఎందుకన్నారు, ఎవర్ని ఉద్దేశించి అన్నారన్నది అంతుబట్టడం లేదు.సొంత త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ డిప్యూటీ సీఎం ప‌ద‌విలో ఉన్న తరుణంలో నాగ‌బాబుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వడంపై కొందరు గుసగుసలాడారు. దానికి సమాధానంగా ఆయన ఈ మాటలు అన్నారా అని కొందరు భావిస్తున్నారు. జ‌న‌సేన శ్రేణుల్లో అసంతృఫ్తిని పొగొట్టేందుకు ఆయన ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. అందువల్లే పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు వస్తాయని, అయితే కాస్త ఓపిగ్గా ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది.మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పడం వెనుక కూడా అర్థం ఇదే అంటున్నారు. కూటమి ప్రభుత్వం సమన్వయంతో సమర్థంగా పరిపాలిస్తోందని చెప్పారు. చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని సమన్వయ కమిటీ పరిష్కరిస్తుందన్నారు. వైసీపీ అరాచకాలపై పోరాటం చేయాలని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.ఈ మాటలు ఎలా ఉన్నా పార్టీ కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు నామినేటెడ్ పదవులు వస్తాయని చెప్పడం మాత్రం నిజంగా శుభవార్తే.
Read More
Next Story