
కర్నూలులో డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం సక్సెస్
సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి(ఎన్‌ఓఏఆర్)లో డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఈ క్షిపణిని అభివృద్ధి చేయడంలోను పరీక్షించడంలోను భాగస్వాములైన డీఆర్‌డీఓ, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లను ఆయన అభినందించారు. కష్టతమైన, సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు దానిని తయారీ చేయగల సామర్థ్యాన్ని కూడా భారత దేశం కలిగి ఉందని చెప్పడానికి ఈ డ్రోన్ క్షిపణి ప్రయోగం నిరూపించిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశీయంగా డెవలప్ చేసిన ఈ క్షిపణిని యూఏవీ లాంచ్‌డ్ ప్రషన్ గైడెడ్ మిస్సైల్(యూఎల్‌పీజీఎం)–వీ3గా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఈ క్షిపణిని పరీక్షించేందుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని డీఆర్‌డీవో పరిధిలోని ఎన్‌ఓఏఆర్ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకున్నారు.
In a major boost to India’s defence capabilities, @DRDO_India has successfully carried out flight trials of UAV Launched Precision Guided Missile (ULPGM)-V3 in the National Open Area Range (NOAR), test range in Kurnool, Andhra Pradesh.
— Rajnath Singh (@rajnathsingh) July 25, 2025
Congratulations to DRDO and the industry… pic.twitter.com/KR4gzafMoQ
Andhra Pradesh is proud to contribute to the growth of our nation's defence ecosystem! Congratulations to our scientists and innovators on the successful flight trials of the UAV-Launched Precision Guided Missile (ULPGM-V3) at the National Open Area Range (NOAR) in Kurnool,… https://t.co/JPKZqGSHEW
— N Chandrababu Naidu (@ncbn) July 25, 2025