
సియోల్ లో కొనసాగుతున్న మంత్రుల పర్యటన
దక్షిణ కొరియా సియోల్ లో రాష్ట్ర మంత్రులు నారాయణ, జనార్థన్ రెడ్డిలు తమ పర్యటన కొనసాగిస్తున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తున్న మంత్రులు పి నారాయణ, బీసీ జనార్ధన్‌రెడ్డి బృందం దక్షిణ కొరియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు, ఏపీ ఈడీబీ అధికారులను కలిశారు. కియా (KIA) కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి..ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. గ్లోబల్ మార్కెట్‌లో కియా కార్ల అమ్మకాలు, కియా యూనిట్‌ల విస్తరణపై చర్చించారు. ఏపీలో కియా యూనిట్‌కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను కియా ప్రతినిధులకు వివరించిన మంత్రులు, విశాఖలో నవంబర్‌లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని ఆహ్వానించారు. సియోల్‌లో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ లొట్టే (Lotte) సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రులు, ఉన్నతాధికారులు.. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, కెమికల్స్, ఫార్మా రంగాలలో పెట్టుబడులు పెట్టే లొట్టే గ్రూప్‌ను ఏపీకి ఆహ్వానించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహించనున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు లొట్టే (Lotte) సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ లొట్టే (Lotte) సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు
లొట్టే గ్రూప్ ప్రతినిధులతో భేటీ
ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, రిటైల్, కెమికల్స్, & అతిథ్యం వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టే లొట్టే (Lotte) గ్రూప్ ను.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రులు ఆహ్వానించిన రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి సానుకూల అంశాలను లొట్టే (Lotte) గ్రూప్ ప్రతినిధులకు మంత్రులు వివరించారు.
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 14,15 తేదీల్లో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 30 వ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు లొట్టే (Lotte) సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో సుస్థిర ప్రభుత్వంతో.. అభివృద్ధి దిశలో తొలి అడుగులు పడుతున్నాయి అంటూ, వ్యూహాత్మక పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపై మంత్రులు వారికి వివరించారు. సమావేశంలో ఐఏఎస్ అధికారులు ఎం.టీ.కృష్ణ బాబు, ఇండియన్ ఎంబసీ, ఈడీబీ అధికారులు పాల్గొన్నారు.