పార్టీతో పాటు ప్రభుత్వాన్నీ ఇరకాటంలోకి నెట్టేసిన సురేఖ
x

పార్టీతో పాటు ప్రభుత్వాన్నీ ఇరకాటంలోకి నెట్టేసిన సురేఖ

మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలు, ఆరోపణలు పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇరకటాంలోకి నెట్టేసినట్లున్నాయి.


మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలు, ఆరోపణలు పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇరకటాంలోకి నెట్టేసినట్లున్నాయి. సినీ సెలబ్రిటీలు సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారంపై మంత్రి అనవసరంగా నోరుపారేసుకున్నారు. తనకు ఏమాత్రం సంబంధంలేని విషయాలపై కొండా సురేఖ పదేపదే ఆరోపణలు చేయటంతో ప్రతిపక్షపార్టీలకు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంపై దాడిచేయటానికి అస్త్రాలు ఇచ్చినట్లయ్యింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేయాలని అనుకున్న మంత్రి చివరకు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేని అక్కినేని కుటుంబం, సమంతపై తీవ్రమైన ఆరోపణలు చేసి రోడ్డుమీదకు లాగేశారు.

బీజేపీ నేత, కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి వేసిన ప్రశ్నే నిదర్శనం. వైష్ణవ్ మంత్ర కొండా సురేఖ ఆరోపణలపై స్పందించాలని రాహుల్ ను డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని కేంద్రమంత్రి మండిపడ్డారు. సినీ పరిశ్రమను కాంగ్రెస్ ఏ విధంగా చూపించే ప్రయత్నాలు చేస్తోందో అర్ధమవుతోందని వైష్ణవ్ అన్నారు. సమంత విడాకులపై కొండాసురేఖ అంత ఘోరమైన ఆరోపణలు చేసినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. అంటే కొండా సురేఖ చేసిన ఓవర్ యాక్షన్ కు కేంద్రమంత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను పిక్చర్లోకి లాగుతున్నారు.

పలువురు సినీ ప్రముఖులపై మంత్రి కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు దిగ్ర్బాంతిని కలిగించినట్లు చెప్పారు. నిజానికి అశ్వనీకి తెలంగాణాతో ఎలాంటి సంబంధంలేదు. అయినా సరే స్పందించారంటే కొండా సురేఖ చేసిన ఓవర్ యాక్షనే కారణమని చెప్పకతప్పదు. దేశానికి ఎంతో గర్వకారణమైన వినోదపరిశ్రమను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తోందో కొండా ఆరోపణలు, వ్యాఖ్యలతో అందిరకీ తెలిసిందన్నారు. సమాజంలో ఇలాంటి విమర్శలకు తావులేదన్నారు. కొండా చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించకుండా ఉన్నారంటే ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా ఉన్నట్లే కనిపిస్తోందని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.

Read More
Next Story