‘డీబీటీ నిధులతో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు’
x

‘డీబీటీ నిధులతో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు’

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో మంత్రి సవిత వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. గత ప్రభుత్వం డీబీటీ ద్వారా ఇచ్చిన డబ్బులతో మహిళలు గంజాయి, మందుకు అలవాటు పడ్డారని తీవ్ర సంచల వ్యాఖ్యలు చేశారు. కాపులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు స్వయం ఉపాధి లేక పోవడం వల్ల, సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ లేక పోవడం వల్ల ఎలా తయారయ్యాంటే.. గత ప్రభుత్వం ఇచ్చిన డీబీటీ నిధులతో గంజాయికి, మందుకి అలవాటు పడ్డారని, ప్రత్యేకించి మహిళలు వీటికి అలవాటు పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్క సారిగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేచారు. మంత్రి సవిత వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరకరం తెలిపారు. బాధ్యతాయుతమైన బీసీ మంత్రిగా ఉండి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు. మండలి ఛైర్మన్‌ కొయ్యే మేషేన్‌ రాజు కూడా మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహిళా మంత్రి అయ్యుండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.

దీంతో ఒక్క సారిగా మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార ప్రతిపక్షల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంత్రి సవిత వ్యాఖ్యలను సమర్థించారు. మంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. మంత్రి సవిత వ్యాఖ్యలకు నిరసనగా మండలి నుంచి వాకౌట్‌ చేశారు.
అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. మంత్రి సవిత వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రంలోని మళలు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓట్లేసి కూటమిని గెలిపించిన కాపులకు ఒక రూపాయి కూడా కేటాయించలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి సవిత మాటలున్నాయమని ఎమ్మెల్సీ రవిబాబు అన్నారు. మంత్రి సవిత వ్యాఖ్యల వెనుక ఆ పార్టీ పెద్దలున్నారని, వారే ఈ వ్యాఖ్యలు చేయించారనే అనుమానాలున్నాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్‌ అన్నారు. మంత్రి సవిత వ్యాఖ్యలు హేయమైనవని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. కూటమి ప్రభుత్వంలో హిళలకు కనీస విలువ లేదన్నారు. తక్షణమే రాష్ట్రంలోని మహళలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియా కేసులు పెడుతూ ప్రజల గొంతు నొక్కేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు.
Read More
Next Story