టాటా గ్రూప్ ఛైర్మన్‌తో చంద్రబాబు, లోకేష్ భేటీ.. స్వర్ణాంధ్ర 2047 టార్గెట్
x

టాటా గ్రూప్ ఛైర్మన్‌తో చంద్రబాబు, లోకేష్ భేటీ.. స్వర్ణాంధ్ర 2047 టార్గెట్

టాటా గ్రూప్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్ ఈరోజు అమరావతికి విచ్చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబుతో కీలక అంశాలపై చర్చించడానికి ఆయన విచ్చేశారు.


టాటా గ్రూప్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్ ఈరోజు అమరావతికి విచ్చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబుతో కీలక అంశాలపై చర్చించడానికి ఆయన విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖరన్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై వారు చర్చించారు. ఈ సమావేశం అత్యంత ఫలదాయంగా జరిగిందని ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి చంద్రశేఖర్ సుముఖత వ్యక్తం చేశారు. అంతేకాకుండా పెట్టుబడులను ఆకర్షించడానికి రూపొందిస్తున్న నూతన పారిశ్రామిక విధానం గురించి కూడా చర్చించారు చంద్రబాబు. దీనిపై చంద్రశేఖర్ తన అభిప్రాయాలు వివరించారు.

సహకారం కోరిన లోకేష్

సీఎం చంద్రబాబుతో సమావేశం కావడం కోసం సచివాలయం చేరుకున్న చంద్రశేఖరన్‌తో ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భేటి అయ్యారు. ఆయన ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పెట్టుబడి పెట్టే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాల నుంచి వివరించారు. ‘‘ఏపీలో ఐటి, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యువబుల్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవసరమైన అన్నివనరులు ఉన్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా లాభదాయకంగా ఉంటుంది. వీటిలో పెట్టుబడులు పెట్టడానికి టాటా గ్రూప్ప్‌ను ఆహ్వానిస్తున్నాం. రాబోయే ఐదేళ్లలో ఏపీలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు సహకరించే అన్ని పరిశ్రమలకు మెరుగైనా ప్రోత్సాహకాలు అందిస్తాం. చంద్రబాబు నేతృత్వంలో ఏపీ వేగంగా అభివద్ధి చెందాలి’’ అని వివరించారు. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ వరకు వెళ్లి ఆయనకు వీడ్కోలు పలికారు లోకేష్.




ఏపీకి ప్రత్యేక టాస్క్ ఫోర్స్

గన్నవరం ఎయిర్‌పోర్ట్ వెళ్లడానికి ముందే సీఎం చంద్రబాబుతో కూడా టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. ఇందులో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజయ్ ప్రధానంగా చర్చ జరిగింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వీటితో పాటుగా రాష్ట్రంలో పెట్టుబడులు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ గురించి వీరు పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు చంద్రశేఖరన్ కోచైర్మన్‌గా ఉంటారు. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా దీనిని రూపొందించాలని యోచిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అమరావతిలో సీఐఐను కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

Read More
Next Story