
మోదీ మనసు దోచుకున్న మంత్రి లోకేష్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కూడా దక్కని అరుదైన అవకాశం లోకేష్‌కు దక్కింది.
సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసును దోచుకున్నారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ టూర్‌కి వచ్చినప్పుడల్లా లోకేష్‌ను గమనించారు. కార్యక్రమాలను లోకేష్ ఆర్గనైజ్ చేస్తున్న తీరు ప్రధాని మోదీని విపరీతంగా ఆకట్టుకుంది. 2025 జనవరి 8న అనకాపల్లి జిల్లా పూడిమడక ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపనకు, ఇటీవల మరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభానికి మే 2న వచ్చిన ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఘనస్వాగత ఏర్పాట్లు చేసి, మోదీ మనసులో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు.
లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లకు ముగ్ధుడైన ప్రధాని మోదీ లోకేష్‌ను దగ్గరకు తీసుకుని అభినందించారు. అంతేకాకుండా ఢిల్లీకి వచ్చినప్పడు తనను ఎందుకు కలవలేదని ప్రధాని మోదీ స్వయంగా మంత్రి లోకేష్‌ను అడిగారు. ఈసారి ఢిల్లీకి వచ్చినప్పుడు తనను తప్పకుండా కలవాలని.. మిస్ కావోద్దని మోదీ లోకేష్‌ను ఆహ్వానించారు.
మూడు రోజుల ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా పర్యటన అనంతరం నేరుగా హైదరబాద్ వెళ్లిన మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ముందుగా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేశారు. లోకేష్ అని చెప్పగానే మోదీ అపాయింట్‌మెంట్ దొరికింది. ఇక లోకేష్ తన భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాంశ్‌లను తీసుకొని శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా ప్రధాని మోదీ అధికారిక నివాసంకు వెళ్లారు. పలు కార్యాక్రమాలతో నిత్యం బిజీగా ఉండే ప్రధాని మోదీ లోకేష్ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. మోదీ తన విలువైన సమయాన్ని వీరి కోసం వెచ్చించారు. చాలా సమయం వీరితో స్పెండ్ చేశారు. నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్‌లతో కలిసి మోదీ భోజనం కూడా చేశారు. రాత్రి 7:20 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ప్రధాని మోదీ లోకేష్ కుటుంబంతోనే గడిపారు. లోకేష్ కుమారుడు దేవాంశ్‌తో మోదీ ముద్దులాడారు. లోకేష్ యువగళం పాదయాత్ర పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. ఓ పుస్తకంపై మోదీ తన సంతకం చేసి లోకేష్‌కు ఇచ్చారు.
ఇలాంటి ఆహ్వానం సీఎం చంద్రబాబుకు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కానీ దక్కలేదు. ఆ ప్రత్యేక ఆహ్వానం లోకేష్‌కు మాత్రమే దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలో లోకేష్ తన సంతోషాన్ని ఉగ్గబట్టలేక పోయారు. ప్రధాని మోదీని కలవడం, ఆయనతో సమావేశం కావడం, కలిసి భోజనం చేయడం తనకు తన కుటుంబానికి ఎంతో చిరస్మణీయమని, జీవితంలో నిలిచిపోతుందని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.