మంగళగిరిలో పద్మశాలి భవన్‌కు మంత్రి లోకేష్‌ శంకుస్థాపన
x

మంగళగిరిలో పద్మశాలి భవన్‌కు మంత్రి లోకేష్‌ శంకుస్థాపన

పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ భవన్‌ను నిర్మిస్తున్నారు.


కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. మంగళగిరి–విజయవాడ బైపాస్‌ లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(పిఐడబ్ల్యూఏ)ఆధ్వర్యంలో ఈ నూతన పద్మశాలి భవన్‌ను నిర్మిస్తున్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌ కు పీఐడబ్ల్యూఏ సభ్యులు, కూటమి నేతలు, కార్యకర్తలు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్‌ శాల ఏర్పాటుచేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత వర్గానికి చెందిన పేద విద్యార్థులు, చేనేత కుటుంబాలకు దాదాపు మూడు కోట్లకు పైగా సహాయ సహకారాలు అందించామన్నారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామన్నారు. 17 ఏళ్ల క్రితం విజయవాడలో ప్రారంభమైన పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమల ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పీఐడబ్ల్యూఏ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా, అభివృద్ధి కార్యక్రమాలు, నూతన పద్మశాలీ భవన్‌ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేతలతో కలిసి ఫోటోలు దిగారు.

Read More
Next Story