
Chiranjeevi |రంగంలోకి దిగబోతున్న మెగాస్టార్
కల్యాణ్ తో పాటు కొందరు ప్రముఖులు ఆదివారం చిరంజీవి(Megastar)తో భేటీ అయ్యారు
తెలుగుసినీ కార్మికుల సమ్మె విరమణ కోసం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రంగంలోకి దిగబోతున్నారు. కొద్దిరోజులుగా వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం సినీకార్మికుల ఫెడరేషన్(Cine Federation) ఆధ్వర్యంలో సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. సమ్మెకారణంగా చాలావరకు షూటింగులు నిలిచిపోయాయి. ఫలితంగా నిర్మాతలు పెద్దఎత్తున నష్టపోతున్నారు. జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు నిర్మాతలు ఫెడరేషన్(Telugu Cinema Industry) నేతలతో చర్చలు జరిపినా ఉపయోగం కనబడలేదు. ఉపయోగం కనబడకపోగా పరస్పరం ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునేదాకా పరిస్ధితి దిగజారిపోయింది. దాంతో నిర్మాతల్లో ఆందోళన పెరిగిపోతోంది.
ఇందులో భాగంగానే నిర్మాతల్లో ఒకరైన చిల్లర కల్యాణ్ తో పాటు కొందరు ప్రముఖులు ఆదివారం చిరంజీవి(Megastar)తో భేటీ అయ్యారు. సమస్యపరిష్కారానికి చొరవ చూపించాలని విజ్ఞప్తిచేశారు. తర్వాత మీడియాతో కల్యాణ్ మాట్లాడుతు సమస్యలన్నీ చిరంజీవికి వివరించినట్లు చెప్పారు. సమ్మెవిరమణకు చొరవ తీసుకోవాలని రిక్వెస్టుచేసినట్లు చెప్పారు. అందుకు చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సోమవారం ఫెడరేషన్ ముఖ్యులు కూడా మెగాస్టార్ ను కలబోతున్నట్లు కల్యాణ్ చెప్పారు. తన వంతుగా కార్మికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని కల్యాణ్ చెప్పారు.
ఇరువర్గాలతో చిరంజీవి మాట్లాడి తగిన న్యాయంచేస్తారని కల్యాణ్ ఆశాభావం వ్యక్తంచేశారు. కార్మికులను నిర్మాతలు కలిసి కన్వీన్స్ చేయాల్సిన అవసరం ఉందని కల్యాణ్ గుర్తుచేశారు. లేబర్ కమీషనర్ నిబంధనల ప్రకారం సినిమాలకు ఎవరూ పనిచేయలేరని కల్యాణ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మొత్తంమీద ఇటు నిర్మాతల మండలి తరపున, అటు ఫెడరేషన్ తరపున చిరంజీవితో భేటీ అవుతున్న కారణంగా తొందరలోనే సమస్య పరిష్కారమవుతుందని అందరు నమ్ముతున్నారు.