బయటపడ్డ అతి పురాతన గూళ్లు
x

బయటపడ్డ అతి పురాతన గూళ్లు

తిరుపతికి అతి చేరువలో అతి పురాతనమైన రాక్షస గూళ్లు బయటపడ్డాయి. అవి ఏంటంటే..


భారతదేశం చారిత్రక అక్షయ పాత్రగా అనేక మంది చరిత్రకారులు చెప్తుంటారు. భారత్‌దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చారిత్రక అంశం వెలుగుచూస్తూనే ఉంటుందని 80శాతం మంది చరిత్రకారులు గట్టిగా నమ్ముతారు. వారి నమ్మకాన్ని తాజాగా తిరుపతి సమీపంలో లభించిన రాతి గూళ్లు నియం చేస్తున్నాయి. ఒకటి రెండు కాదు వందల సంఖ్యలో వీటిని గుర్తించినట్లు రచయిత, చరిత్రకారుడు, ట్రెకర్ అయిన భూమన్ వెల్లడించారు. వీటిని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు పర్యటకలు, ప్రకృతి ప్రియులు, చరిత్ర ప్రేమికులపై కూడా ఉంటుందని వివరించారు. వీటిని తిరుపతి-పలమనేరు గుండా బైరెడ్డిపల్లె నుంచి చట్టిపల్లె, విరూపాక్షపురం వెళ్లే దార్లో గుట్టగుట్టలు ఉన్నాయని, ఇవి ఎన్ని వేల ఏళ్ల కిత్రానివో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వీటి నిర్మాణం చాలా ఆశ్చర్యంగా ఉందని, ఇంత పెద్ద బండలను అప్పట్లో ఎలా ఎత్తారు, ఎలా నిలబెట్టారో అర్థం కావట్లేదని అన్నారు. ‘‘ఇది ఎంతి పురాతన వారసత్వం. వాలు రాతి స్తంబాలు. వాటిని పలు రాళ్లు పేర్చి కట్టారు. వాటిపైన ఒక పెద్ద రాతి బండ. అది 6 అడుగులు వెడల్పు, 12 అడుగుల పొడవు ఉండొచ్చు. అంత పెద్ద బండను ఆ నాలుగు పలకలపైన, గుండ్రాళ్ల మధ్యన ఎలా అమర్చారో కదా. ఈ ఇంజినీరింగ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇవి సుమారు 3 వేల ఏళ్ల క్రితం నాటివి. ఈ బండరాళ్లపై కొన్ని రాతలు, బొమ్మలు కూడా ఉన్నాయి. చెరిగిపోయినవి పోగా ఇప్పటికీ కనిపిస్తున్న మన పురాతన సోదరుడి రాతను చూసి ఉబ్బితబ్బిపోయాను’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారాయన. వీటి గురించి పూర్తి సమాచారం ఉన్న కథనం మా TheFederalTelangana సైట్‌లో ఉంది.

Read More
Next Story