వీడియో స్టోరీ: అన్న క్యాంటీన్ కన్నా చౌకగా విజయవాడలో భోజనం! అసలు కథ ఇదే
x

వీడియో స్టోరీ: అన్న క్యాంటీన్ కన్నా చౌకగా విజయవాడలో భోజనం! అసలు కథ ఇదే

విజయవాడలో కొందరు ఉదారంగా స్పందించి పేదల కడుపునింపే ప్రయత్నం చేస్తుండడం అభినందనలు అందుకుంటోంది. మన భోజనశాల పేరుతో కేవలం రూ. 20కే కడుపునింపుతుండడం అందుకు కారణం.



విజయవాడ మొఘల్రాజపురంలో గడిచిన కొన్నేళ్ళుగా మన భోజనశాల నడుస్తోంది. కేవలం రూ. 20కే 9రకాల ఆహార పధార్థాలతో మధ్యాహ్న భోజనం అందిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు.

సామాన్యుల కడుపు నింపే ప్రయత్నంలో అనేక మంది సహకారంతోనే విజయవంతంగా నడపగలుగుతున్నామని మన భోజనశాల నిర్వాహకుడు సాక్షి ఆదినారాయణ ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో అన్నారు.

కూరగాయలు, బియ్యం. ఇతర దినుసులతో పాటుగా పలు రూపాల్లో మిత్రుల నుంచి అందుతున్న సహకారం ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు.

కొందరైతే ఈ భోజనశాలలో స్వయంగా సేవలు అందించేందుకు సైతం సిద్ధమయ్యారు. పేదలకు తక్కువ ధరలో ఆహారం అందిస్తున్న దగ్గర సేవ చేయాలనే సంకల్పంతో తాను భాగస్వామినయ్యానంటూ ఇందిర అనే మహిళ తెలిపారు.

వివిధ రకాల ఆహారపదార్థాలతో కడుపునింపుతున్న మన భోజనశాల నిర్వహణ పట్ల అనేకమంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిఫిన్ కన్నా చౌకగా కడుపు నింపే ప్రయత్నం తమకెంతో మేలు చేసిందంటున్నారు.

ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అన్న క్యాంటీన్లలో ఒక్క పూట భోజనానికి ప్రభుత్వం రూ. 35 చొప్పున వెచ్చిస్తోంది. ప్రజల నుంచి రూ. 5 మాత్రమే వసూలు చేసినప్పటికీ మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే ట్రస్ట్ ద్వారా అక్షయపాత్ర సంస్థకు అందిస్తోంది. కానీ మన భోజనశాలలో మాత్రం అంతకుమించిన ఆహారపధార్థాలతో కేవలం రూ. 20 కే పౌష్టికాహారం అందిస్తున్న తీరు ఆసక్తిదాయకంగా ఉంది.


వీడియో కథనం చూడండి



Read More
Next Story