ఐపీఎస్ ల భారీ బదిలీలు
x

ఐపీఎస్ ల భారీ బదిలీలు

ఏపీలో పలువురు ఐపీఎస్ లను ప్రభుత్వం సోమవారం రాత్రి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీ చేసింది. సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పోస్టింగ్ ల కోసం ఎదురు చూస్తున్న వారిలో కొందరికి పోస్టింగ్ లు దక్కాయి. తిరుపతిలో తొక్కిసలాటకు బాధ్యులుగా భావిస్తూ బదిలీ కి గురై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న తిరుపతి నాటి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ కు ఈ బదిలీల్లో పోస్టింగ్ లు ఇచ్చారు. కేంద్రంలో డిప్యుటేషన్ ముగించుకొని వచ్చిన మధుసూదన్ రెడ్డి, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పాలరాజుకు పోస్టింగ్స్ ఇచ్చారు.

ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు.

ఏపీ శాంతి భద్రతల అదనపు డీజీగా ఎన్ మధుసూధన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

ఐజీపీ (ఆపరేషన్స్‌) గా సీహెచ్‌ శ్రీకాంత్‌‌ను నియమించారు. టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీపీ గా ఈయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఏపీఎస్పీ బెటాలియన్‌ ఐజీపీగా బి రాజకుమారి నియమితులయ్యారు.

ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌గా జి పాలరాజు కు పోస్టింగ్ ఇచ్చారు.

తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ను నియమించారు.

తిరుపతి జిల్లా ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా ఎల్‌ సుబ్బరాయుడు నియమితులయ్యారు.

కాకినాడ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌‌ను కర్నూలు ఎస్పీగా బదిలీ చేశారు.

కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్‌ ను నియమించారు.

కడప ఎస్పీగా ఈజీ అశోక్‌ కుమార్‌‌ను నియమించారు.

ఏసీబీ డైరెక్టర్‌గా ఆర్‌ జయలక్ష్మి నియమితులయ్యారు.

గ్రేహౌండ్స్‌ డీఐజీగా బాబూజీ అట్టాడ ను నియమించారు.

ఏపీఎస్పీ డీఐజీ గా ఫక్కీరప్ప కు బాధ్యతలు అప్పగించారు.

పీటీవో డీఐజీగా సత్య యేసుబాబు ను నియమించారు.

వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ డీఐజీగా అన్బురాజన్‌‌ ను ప్రభుత్వం నియమించింది.

ఏపీఎస్పీ కర్నూల్‌ రెండో బెటాలియన్‌ కమాండెంట్‌గా ఎం దీపికను నియమించారు.

ఎస్‌సీఆర్‌బీ, సీఐడీ ఎస్పీగా పి పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

కో-ఆర్డినేషన్, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ లీగల్‌ ఎస్పీగా కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ని నియమించారు.

సీఐడీ ఎస్పీ లుగా ఎన్‌ శ్రీదేవి రావు, ఎస్‌ శ్రీధర్‌, కె చక్రవర్తి నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్‌ ఎస్పీలుగా జె రామ మోహన్‌రావు, ఎ రమాదేవిలను నియమించారు.

విశాఖపట్నం, విజయవాడ అడ్మినిస్ట్రేషన్ డీసీపీలుగా కృష్ణకాంత్‌ పటేల్‌, సరితలను ప్రభుత్వం నియమించింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీగా ధీరజ్‌ కునుబిల్లి నియమితులయ్యారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌)గా జగదీశ్‌‌ను ప్రభుత్వం నియమించింది.

Read More
Next Story