ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
x

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

31 మంది అఖిల భారత సర్వీసు అధికారులను గురువారం బదిలీ చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టారు. ఆ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న కేవీఎన్‌ చక్రధర్‌ బాబును వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఎండీ మార్క్‌ఫెడ్‌గా ఉన్న డాక్టర్‌ మంజీర్‌ జిలానీ సమూన్‌ను వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న మరో ఐఏఎస్‌ అధికారి పట్టంశెట్టి రవి సుభాష్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న లోతేటి శివ శంకర్‌ను ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఛైర్మన్, ఎండీగా నియమించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఎస్‌ డిల్లీరావును ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న మరో ఐఏఎస్‌ అధికారి పి రంజిత్‌ బాషాను ఇంటర్‌ బోర్డు డైరెక్టర్‌గా నియమించారు.

పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న పి అరుణ్‌బాబును ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ ఎండీగా నియమించారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న జే వెంకట మురళీని సీసీఎల్‌ఏ అదనపు కార్యదర్శిగా నియమించారు. కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఉన్న బి నవ్యాను ఏపీ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేశారు. ఏపీ మారీటైమ్‌ బోర్డు సీఈవోగా ఉన్న సీవీ ప్రవీణ్‌ ఆధిత్యాను ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేశారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న కేఎస్‌ విశ్వనాథన్‌ను ఐ అండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సర్వే సెటిల్‌మెంట్స్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఆర్‌ గోవిందరావును పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఎస్‌ చిన్నరాముడును ఏపీ స్టేట్‌ ఎస్సీ కమిషన్‌ కార్యదర్శిగా నియమించారు. ఏపీసీఆర్‌డిఏ అదనపు కమిషనర్‌గా ఉన జీ సూర్యసాయి ప్రవీన్‌చంద్‌ను ఏపీ ట్రాన్స్‌కో జెఎండీగా బదిలీ చేశారు. కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న భావనను బాపట్ల జేసీగా బదిలీ చేశారు. నంద్యాల జేసీగా ఉన్న సీ విష్ణు చరణ్‌ను సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఎస్‌ఎస్‌ షోబికకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా నియమించారు. శ్రీసత్యసాయి జిల్లా జేసీగా ఉన్న అభిషేక్‌ కుమార్‌ను ఏపీ మారీటైమ్‌ బోర్డు సీఈఓగా బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న కొల్లాబత్తుల కార్తిక్‌ను నంద్యాల జేసీగా నియమించారు. తిరుపతి జిల్లా జేసీగా ఉన్న శుభమ్‌ బన్సాల్‌ను పరిశ్రమల శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీగా ఉన్న అభిషేక్‌ గౌడను ఏలూరు జిల్లా జేసీగా బదిలీ చేశారు. ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న కర్నూలు జిల్లా జేసీగా బదిలీ చేశారు. కాకినాడ జేసీగా ఉన్న రాహుల్‌ మీనాను రాజమండ్రి మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఏటిపాక సబ్‌కలెక్టర్‌గా ఉన్న అపూర్వ భరత్‌ను కాకినాడ జేసీగా బదిలీ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్‌కలెక్టర్‌గా ఉన్న మంత్రి మౌర్య భరద్వాజ్‌ను శ్రీసత్యసాయి జిల్లా జేసీగా బదిలీ చేశారు. మార్కాపురం సబ్‌కలెక్టర్‌గా ఉన్న బి సహదిథ్‌ వెంకట్‌ త్రివినాగ్‌ను హౌసింగ్‌ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఏపీ డైరీ డెవలప్‌మెంట కార్పొరేషన్‌ ఎండీగా కోమిశెట్టి మురళీధర్‌ను నియమించారు. ఏపీ సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సొసైటీ కార్యదర్శిగా ఉన్న పసన్న వెంకటేశ్‌ను లెదర్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వీసీ, ఎండీగా బదిలీ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవోగా ఉన్న తిరుమణి శ్రీ పూజను అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీగా బదిలీ చేశారు.
Read More
Next Story