Allu Arjun | అల్లు అర్జున్ అరెస్ట్ వెనక చంద్రబాబు హస్తం..!
x

Allu Arjun | అల్లు అర్జున్ అరెస్ట్ వెనక చంద్రబాబు హస్తం..!

స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీని వెనక భారీ కుట్ర ఉందంటూ ఆరోపణలు పలువురు ఆరోపిస్తున్నారు.


స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అతడికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బన్నీ అరెస్ట్‌పై రాజకీయ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు.. బన్నీ అరెస్ట్ వెనక ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని, తొక్కిసలాటతో సంబంధం లేని అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే.. పుష్కరాల సమయంలో తొక్కిసలాటలకు 28 మంది వరకు మరణించారని, అప్పుడు వాటిని నిర్వహించిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ అరెస్ట్ చాలా బాధాకరమని, ఇందుకు చంద్రబాబే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామే.

తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరికా: లక్ష్మీ పార్వతి

‘‘అల్లు అర్జున్ అరెస్టు బాధాకరం. ప్రతిదానిలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుంది. సినిమా ఎలా ఉంది అని చూడటానికి అల్లు అర్జున్ వెళ్లాడు.. అయితే, అల్లు అర్జున్ వెళ్లినప్పుడు అక్కడ ఏర్పాట్లు చేయని ప్రభుత్వానిది తప్పు. కానీ పోలీసులు మాత్రం ఏ తప్పు చేయని అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. రాజమండ్రి పుష్కరాల్లో, కందుకూరులో ఘటనల సమయంలో ఎంతోమంది మరణించారు. వాటికి చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలి. ఏపీలో చంద్రబాబు.. అక్కడ ఆయన శిష్యుడు ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో రాక్షస పాలన సాగుతోంది’’ అని ఆమె విమర్శలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో శిల్పారెడ్డిని కలిశాడన్న అక్కసుతోనే చంద్రబాబు.. బన్నీని అరెస్ట్ చేయించడానికి కుట్రలు పన్నారని కూడా ఆరోపించారు లక్ష్మీ పార్వతి.

బన్నీ అరెస్ట్‌లో రాజకీయ కుట్ర: మార్గాని భరత్

అల్లు అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర కోణం ఉందని వైఎస్ఆర్‌సీపీ నేత మార్గాని భరత్. సంధ్య థియేగర్ నిర్వాహకులను, జనాన్ని అదుపు చేయని పోలీసులను ఈ ఘటనలో ఎందుకు బాధ్యులను చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకు చంద్రబాబు బాధ్యులని, అలాంటప్పుడు ఆయనను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలని ప్రశ్నించారు. అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు తనకు తానే క్లీన్ చిట్ ఇప్పించుకున్నాడని, చంద్రబాబుకు ఒక చట్టం.. బన్నీకి ఒక చట్టం ఉండకూడదని డిమాండ్ చేశారు. చట్టం కొందరికి చుట్టం కాకూడదని, ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలని కోరారు.

Read More
Next Story