
‘బీర్ బాంబు’లను రెడీచేసుకున్న మావోయిస్టులు
మావోయిస్టులు మాత్రం బీర్ తో బాంబులే(Beet Bombs) తయారుచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
మావోయిస్టుల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు భద్రతాదళాలపైన యుద్ధంచేయటానికి అవసరమైన ఆయుధాలను రెడీచేసుకున్నారు. తాము తలదాచుకున్న కర్రెగుట్టల అడవుల్లోకి భద్రతాదళాలు స్వేచ్చగా చొచుకుని రాకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తమదగ్గరున్న ఆయుధాలు, తీసుకున్న ముందుజాగ్రత్తలు పనిచేయకపోవటంతో ఇపుడు శాంతిచర్చలంటు నానా గోలచేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే మావోయిస్టులు(Maoists) తయారుచేసుకున్న సరికొత్త ఆయుధం ‘బీర్ బాంబు’లు. ఇప్పటివరకు బీర్లంటే తాగటంవరకే చాలామందికి తెలిసింది. బీర్ తాగేసిన తర్వాత బాటిల్ ను పడేస్తారు. కాని మావోయిస్టులు మాత్రం బీర్ తో బాంబులే(Beet Bombs) తయారుచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ బీర్ బాంబుల విషయం ఎలాగ వెలుగులోకి వచ్చింది ? ఎలాగంటే మావోయిస్టుల కోసం ‘ఆపరేషన్ కగార్’ లో (Operation Kagar)భాగంగా భద్రతాదళాలు ఛత్తీస్ ఘడ్-తెలంగాణ-మహారాష్ట్ర మధ్యలో ఉన్న కర్రెగుట్టల(Karreguttala Forest) అడవులను చాలాకాలంగా షెల్టర్ జోన్ గా ఉపయోగించుకుంటున్నారు. 288 చదరపు కిలీమీటర్ల పరిధిలో విస్తరించున్న ఈ అడవుల్లోకి అనుపానులు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఎంటరవ్వగలరు. కొత్తవాళ్ళు ఎవరైనా అడవుల్లోకి ఎంటరైతే తిరిగి అడవుల్లో నుండి బయటకు రావటంకష్టమే. అయితే ఇపుడు మావోయిస్టులు కర్రెగుట్టల్లో సమావేశమైనట్లు తెలుసుకున్న భద్రతాదళాలు పారెస్టు అధికారుల సహాయంతో పైన చెప్పినట్లు మూడురాష్ట్రాల సరిహద్దుల్లో నుండి అడవుల్లోకి ప్రవేశించి మావోయిస్టుల కోసం జల్లెడపడుతున్నారు.
ఇపుడు విషయం ఏమిటంటే తమకోసం భద్రతాదళాలు కర్రెగుట్టల్లోకి ప్రవేశిస్తాయని మావోయిస్టు అగ్రనేతలు ముందుగానే అనుమానించినట్లున్నారు. అందుకనే అడవుల్లోని చాలాచోట్ల బాంబులు. మందుపాతరలను అమర్చి ఉంచారు. అయితే వీటితో పాటు మరో కొత్త బాంబు బీర్ బాంబులను కూడా మావోయిస్టులు భూమిలో అమర్చటం ఇపుడు సంచలనంగా మారింది. మందుపాతరులు, బాంబుల కోసం గాలిస్తున్న భద్రతాదళాలకు ఊహించనిరీతిలో బీర్ బాంబులు కనిపించాయి. బీర్ బాంబులను చూసిన భద్రతాదళాలు ఆశ్చర్యపోయాయి. బీర్లను తాగటానికి మాత్రమే కాకుండా బాంబులుగా కూడా ఉపయోగించుకవచ్చన్న విషయం చాలామందికి ఇపుడే తెలిసింది.
బీర్ బాంబులు ఎలా పనిచేస్తాయి ?
మందుపాతరలు, బాంబులు ఎలాగ పనిచేస్తాయో చాలామందికి తెలుసు. అయితే బీర్ బాంబులు ఎలాగ పనిచేస్తాయి ? ఎలా పనిచేస్తాయంటే బీర్ సీసాల్లో ముందు బాంబులను అమరుస్తారు. ఈ బాంబులను కరెంటువైరుతో అనుసంధానిస్తారు. బీర్ బాటిల్లోపల అమర్చిన బాంబు వైరును బాటిల్ బటయకు తీసుకొస్తారు. వైర్ బయటకు వచ్చిన తర్వాత బాటిల్లో బీర్ నింపేసి కార్క్ ను మామూలుగానే మూసేస్తారు. బీరులో ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఈ కారణంగానే బాటిల్ ను బాగా షేక్ చేస్తే నురగలతో పాటు ఆ నురగ శక్తివంతంగా బయటకు చిమ్ముతుంది. బీర్ బాటిల్ ఓపెన్ చేసి నురుగను బయటకు చిమ్మేవాళ్ళకు ఈ విషయం కొత్తేమీకాదు. బాటిల్ లో నుండి బయటకు వచ్చిన కరెంటు వైరును ఆ పక్కనే ఉంచుకున్న స్విచ్చితో అనుసంధానిస్తారు. ఆ స్విచ్చును రిమోట్ తో ఉపయోగించేట్లుగా ముందే ఏర్పాటు చేసుకుంటారు.
తాము బీర్ బాంబులను భూమిలో ఎక్కడైతే అమర్చారో గుర్తుపట్టేందుకు వీలుగా ఏదో ఏర్పాటుచేసుకుంటారు. భద్రతాదళాలు బీర్ బాంబులపైన కాలువేసినా లేదా దాని సమీపంలోకి వచ్చిన వెంటనే రిమోట్ తో స్విచ్చును ఆపరేట్ చేస్తారు. ఎప్పుడైతే మావోయిస్టులు స్విచ్చిని ఆపరేట్ చేస్తారో వెంటనే బీర్ బాంబ్ పేలుతుంది. బీర్ బాంబుపేలినపుడు ఎంతశక్తి విడుదల అవుతుందన్నది బాటిల్లోపల అమర్చిన బాంబును బట్టి ఉంటుంది. ఇపుడు కర్రెగుట్టల అడవులను జల్లెడపడుతున్న భద్రతాదళాలకు మందుపాతరలు, బాంబులతో పాటు బీర్ బాంబులు కూడా దొరుకుతున్నాయి. ఈ బాంబులన్నింటినీ బాంబు డిటెక్టర్స్, డాగ్ స్వ్కాడ్స్ పసిగడుగున్నాయి. ఇప్పటికి సుమారు 300 మందుపాతరలు, పెద్దఎత్తున బాంబులు, బీర్ బాంబులను భద్రతాదళాలు పసిగట్టి నిర్వీర్యంచేస్తున్నాయి.