డీజీపీ వద్ద లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
x

డీజీపీ వద్ద లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

ఏఓబీ పరిధిలో భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏపీ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా వెల్లడించారు.


మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు, ఆ పార్టీ సీనియర్‌ నాయకులు శనివారం ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఎదుట లొంగి పోయారు. వారి వివరాలను డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ సీనియర్‌ నాయకులు రామకృష్ణ, ఆయన భార్య అరుణ ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏవోబీ పరిధిలో భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏకే 47, హ్యండ్‌ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికల మీద నిఘా ఉంచామని, వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాలలో దళ సభ్యులుగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న వారంతా జనజీవన స్రవంతిలోకి రావాలని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్దిలో భాగస్వాములు కావాలని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా కోరారు.

శనివారం డీజీపీ వద్ద సరెండర్‌ అయిన మావోయిస్టు దంపతులు రామకృష్ణ, అరుణలు ఆ పార్టీలో సీనియర్‌ నాయకులుగా ఉన్నారు. సుమారు 34 సంవత్సరాలకుపైగా మావోయిస్ట్‌ పార్టీలో పని చేసిన చేశారు. రామకృష్ణ ప్రస్తుతం తూర్పు బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి ఇన్చార్జ్‌ పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో హోదాలో ఉన్నారు. మావోయిస్టు పార్టీ వైఫల్యాలు, కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది, ఈ సిద్ధాంతం ఇక చలామణి అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు డీజీపీ పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌ లో ఇరువురు చాలా కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణ పై ఆంధ్రప్రదేశ్‌లో రూ. 20 లక్షలు, అరుణ పై రూ, 5 లక్షల రివార్డు ఉంది.
లొంగిపోయిన దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందచేసినట్లు డీజీపీ పేర్కొన్నారు, తమ ఆపరేషన్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో తమ పోలీసు బలగాలు భారీగా ఆయుధాలు డంప్‌ స్వాధీనం చేసుకుందన్నారు. వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్‌ సమాచార ఆధారంగా దీనిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందన్నారు. మావోయిస్టు లుగా ఉన్న వారు పునరాలోచన చేయాలని, హింసాత్మక ఘటనలతో సాధించేదేమీ లేదని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, మీ కుటుంబ సభ్యులు గురించి అయినా ఆలోచనలు చేయాలని, జన జీవన స్రవంతి లోకి వస్తే... ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డీజీపీ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న ఏపీకి చెందిన వారంతా ఏడు నెలల్లో అందరూ లొంగిపోవాలని కోరుతున్నట్లు తెలిపారు.
Read More
Next Story