Manoj cries|మీడియా ముందే ఏడ్చేసిన మనోజ్
వినయ్, మద్దతుదారులు తనపైన దాడిచేసి గాయపరిచినట్లు ఆరోపించాడు. తన తండ్రి మోహన్ బాబు(MohanBabu) దేవుడు లాంటి వ్యక్తని వినయ్ వల్లే గొడవలు జరిగినట్లు మండిపడ్డాడు.
మంచు మనోజ్ మీడియా ముందే ఏడ్చేశాడు. జల్ పల్లి ఫామ్ హౌస్(Jalpalli Farm House) బయట బుధవారం 11 గంటలకు మనోజ్ మీడియాతో మాట్లాడుతు ఇంట్లో జరిగిన, జరుగుతున్న గొడవలను వివరించాడు. తనింట్లోనే తాను ఒంటరివాడిని అయిపోయినట్లు చెప్పాడు. తనింట్లో వినయ్, మద్దతుదారులు తనపైన దాడిచేసి గాయపరిచినట్లు ఆరోపించాడు. తన తండ్రి మోహన్ బాబు(MohanBabu) దేవుడు లాంటి వ్యక్తని వినయ్ వల్లే గొడవలు జరిగినట్లు మండిపడ్డాడు. మోహన్ బాబు మీడియా మీద దాడిచేసి రిపోర్టర్ ను గాయపరిచినందుకు తండ్రి తరపున సారి చెప్పాడు. ఈరోజు చూస్తున్న తండ్రి తన తండ్రి కాదన్నాడు. తాను అబద్ధాలు ఆడేవ్యక్తిని కాదని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. తన సొంతకాళ్ళపైన తాను నిలబడుతున్నట్లు చెప్పాడు.
ఇంటిగొడవలతో రోడ్డునపడతానని, మీడియా మీద తన తండ్రి దాడిచేసేరోజు వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నాడు. తాను ఇంట్లో ఎవరిపైనా దాడిచేయలేదన్నాడు. సాయంత్రం 5.30 గంటలకు మీడియా ముందు అన్నీ సాక్ష్యాధారాలు చూపిస్తానని చెప్పాడు. తనమీద దాడి జరిగిన రోజున ఉదయం డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసినట్లు వివరించాడు. తనింట్లోనే గాయపడిన తనను తీసుకుపోవటానికి 108 అంబులెన్స్ వచ్చినట్లు చెప్పాడు. ఇంట్లో అందరు ఉన్నారు, పది కార్లుండగా ప్రత్యేకంగా తనను ఆసుపత్రికి తీసుకెళ్ళటానికి 108 అంబులెన్స్ ఎందుకు వచ్చిందో వాకాబు చేయమని మనోజ్ (Manoj)మీడియాను రిక్వెస్టు చేశాడు. తనను చెడ్డవ్యక్తిగా చిత్రీకరిస్తున్న కారణంగానే తాను మీడియా ముందుకు రావాల్సొచ్చిందని వివరించాడు. ఇంట్లో జరుగుతున్న వివాదాల కారణంగానే అనారోగ్యంపాలై తన తల్లి ఆసుపత్రిలో చేరిందన్నాడు. తనకు నోటీసులు అందినట్లుగానే రాచకొండ పోలీసు కమీషనర్ కార్యాలయంకు విచారణకు హాజరవుతున్నట్లు చెప్పిన మనోజ్ సాయంత్రం అన్నీ సాక్ష్యాధారాలతో కలుద్దామని చెప్పాడు.