
కాకినాడలో భారీ ప్రమాదం..ముగ్గురు మృతి
ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మణం పాలయ్యారు. మరో ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రికి చెందిన అపోలో ఫార్మసీ ఉద్యోగులు శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా, విశాఖపట్నం నుంచి మండపేటకు ఐరన్ లోడుతో వెళ్తూ కాకినాడ తుని వద్ద ఆగి ∙ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారంతా రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. రాజమండ్రికి చెందిన గెడ్డం రాజమరాజు, హజరత్ వాలీ, తణుకుకు చెందిన పరాడ సుధీర్‌లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో గోనా శివశంకర్, వెంకట సుబ్బారావులను అత్యవసర వైద్య చికిత్సల కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story