ఈడీ ముందుకు మహేష్ బాబు
x
Mahesh to appear before ED

ఈడీ ముందుకు మహేష్ బాబు

ఈనెల 27వ తేదీన హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసులో విచారణకు రావాలని మహేష్ కు సంబంధిత సంస్ధ నోటీసులు(ED inquiry) జారీచేసింది.


దర్యాప్తుసంస్ధల విచారణ ఎలాగుంటుందో ప్రిన్స్ మహేష్ బాబుకు ఇపుడు నిజంగానే తెలిసొస్తుంది. కొన్నిసినిమాల్లో అండర్ కవర్ కాప్ గాను, మరికొన్ని సినిమాల్లో డైరెక్టు పోలీసు అధికారిగాను మహేష్(Prince Mahesh Babu) పాత్రలు వేసిన విషయం తెలిసిందే. సినిమాల్లో పోలీసు పాత్రలు, దర్యాప్తు సన్నివేశాలు, విచారణ సన్నివేశాలు మహేష్ కు బాగా అలవాటే. అలాంటి మహేష్ ఇపుడు నిజజీవితంలో దర్యాప్తుసంస్ధ విచారణను ఎదుర్కోబోతున్నారు. ఈనెల 27వ తేదీన హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసులో విచారణకు రావాలని మహేష్ కు సంబంధిత సంస్ధ నోటీసులు(ED inquiry) జారీచేసింది.

ఇంతకీ మహేష్ కు ఈడీ నోటీసులు ఎందుకు జారీచేసిందంటే ఒక మోసకారి రియల్ ఎస్టేట్ సంస్ధ ముఖ్యులను ఈడీ అరెస్టుచేసింది. జనాల దగ్గర నుండి కోట్లాదిరూపాయలు వసూళ్ళుచేసిన సురానా గ్రూప్, సాయి సూర్యా డెవలపర్స్ ఆఫీసుల్లో ఈడీ అధికారులు దాడులుచేసి కోట్లరూపాయలతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనంచేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే పై రెండుసంస్ధలకు చెందిన ముఖ్యులను అరెస్టుచేశారు. ఈ సంస్ధలకు మహేష్(Mahesh Babu) విచారణకు ఏమిటి సంబంధం అంటే పై రెండు సంస్ధలకు మహేష్ బ్రాండ్ ప్రమోటర్(Brand Promoter) గా వ్యవహరించారు. పై సంస్ధల నుండి ప్రిన్స్ సుమారు రు.6 కోట్ల వసూలుచేసినట్లు ఆధారాలు దొరికాయి. రు. 3.4 కోట్లు నగదు రూపంలో తీసుకున్న మహేష్ మరో రు. 2.5 కోట్లను ఆర్టీజీఎస్ ద్వారా అందుకున్నట్లు ఈడీ అధికారులకు ఆధారాలు దొరికాయి.

వట్టినాగులపల్లి వెంచర్లో జనాలనుండి పెద్దఎత్తున డబ్బులు వసూలుచేసిన సాయిసూర్య డెవలపర్స్ లో కీలకమైన వ్యక్తి సతీష్ తర్వాత మొహంచాటేసినట్లు బాధితులు ఫిర్యాదులు చేశారు. దాంతో పై రెండు సంస్ధల వ్యవహారం అంతా బయటపడింది. బాధితుల ఫిర్యాదుమేరకు ముందు సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేసినా తర్వాత కేసులోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆర్ధిక మోసాలను గుర్తించి మొత్తం వ్యవహారాన్ని సైబర్ పోలీసులు ఈడీకి బదిలీచేశారు. పైరెండు సంస్ధలు కోట్లాదిరూపాయలను షెల్ కంపెనీలకు తరలించినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. వెంచర్లపేరుతో బ్యాంకుల నుండి వేలకోట్లరూపాయలను అప్పులు కూడా పై సంస్ధలు తీసుకున్నాయి.

సురానా గ్రూపు మూడు బ్యాంకులకు రు. 3986 కోట్ల ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించనందుకు సీబీఐ కేసులు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నది. కంపెనీ ఎండీ దినేష్ చంద్ సురానా, విజయ్ రాజ్ సురానా, డమ్మీ డైరెక్టర్ ఆనంద్ ప్రభాకర్ ను 2022లోనే ఈడీ అరెస్టుచేసింది. గతంలో ఇదే గ్రూపుకుచెందిన రు. 113 కోట్లను ఈడీ జప్తుకూడా చేసింది. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులనే సురానా గ్రూపు డైరెక్టర్లుగా చూపించి బ్యాంకులను మోసంచేసింది. బ్యాంకుల నుండి తీసుకున్న వేలకోట్లరూపాయలను వ్యాపారంలో కాకుండా వ్యక్తిగత ఖాతాలకు మళ్ళించుకున్నారు. సింగపూర్లో నాలుగు కంపెనీలు పెట్టినట్లు చూపించి ఇక్కడ బ్యాంకుల్లో తీసుకున్న వేలాది కోట్ల రూపాయలను సింగపూర్ కు తరలించినట్లు గుర్తించారు. ఇలాంటి మోసకారి సంస్ధకు ప్రిన్స్ మహేష్ బాబు ప్రమోటారుగా వ్యవహరించారు.

ఈమధ్య పలువురు సినీ సెలబ్రిటీలకు పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. బెట్టింగ్ గేమ్ యాప్స్ కు బ్రాండ్ ప్రమోటార్లుగా వ్యవహరించిన సినీ సెలబ్రిటీలు ప్రకాష్ రాజ్(Prakash raj), దగ్గుబాటి రానా, మంచులక్ష్మీ(Manchu Lakshmi)తో పాటు చాలామంది బుల్లితెర సెలబ్రిటీలకు కూడా పోలీసులు నోటీసులిచ్చి విచారించిన విషయం తెలిసిందే. కాబట్టి ఏదో కంపెనీ వచ్చి బ్రాండ్ ప్రమోటారుగా ఉండమని డబ్బులు ఆఫర్ చేసినంత మాత్రాన ఒప్పేసుకుంటే తర్వాత ఇబ్బందులుపడేది సెలబ్రిటీలే అన్నది అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలోనే ఈడీ నోటీసులు జారీచేసింది విచారణకు రమ్మని. మరి మహేష్ ఏమిచేస్తాడో చూడాలి.

Read More
Next Story