
Madhopatti: ఆంధ్రప్రదేశ్ యువతకు స్ఫూర్తి
అధికారుల ఫ్యాక్టరీగా పేరు పొందిన మధోపట్టి గ్రామాన్ని ఏపీ నిరుద్యోగ యువత ఎందుకు స్పూర్తిగా తీసుకోకూడదు.
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో మధోపట్టి (MadhoPatti) గ్రామం ‘అధికారుల ఫ్యాక్టరీ’గా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఈ గ్రామం నుంచి 47 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు ఇస్రో, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, వరల్డ్ బ్యాంక్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలలో కీలక పదవులు నిర్వహిస్తున్న వారిని ఈ గ్రామం అందించింది.
జనాభా, గృహాల గురించి...
2011 సెన్సస్ డేటా ప్రకారం మధోపట్టి గ్రామంలో208 గృహాలు ఉన్నాయి. జనాభా 1,174 మంది (599 పురుషులు, 575 మహిళలు) ఉన్నారు.
గ్రామం గురించి సమాచారం...
మధోపట్టి గ్రామం జౌన్‌పూర్ జిల్లాలోని సిర్కోనీ బ్లాక్‌లో ఉంది. జౌన్‌పూర్ నగరానికి సుమారు 11 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం సుమారు 38.05 హెక్టార్లు (లేదా 94 ఎకరాలు) విస్తీర్ణంలో ఉంది. గ్రామంలోని చాలా మంది వ్యవసాయంపై ఆధారపడతారు. గోధుమలు, శనగలు, బఠానీలు, ఆవాలు, బంగాళ దుంపలు, మొక్కజొన్న, చెరకు వంటి పంటలు పండిస్తారు.
గ్రామంలో సాక్షరత రేటు 72.66 శాతం (పురుషులు 83.2శాతం, మహిళలు 62.13శాతం), ఇది ఉత్తరప్రదేశ్ సగటు (67.68 శాతం) కంటే ఎక్కువ. ఈ విజయ గాథ ఆంధ్రప్రదేశ్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
ఉత్తరప్రదేశ్ లోని మధోపట్టి గ్రామం (ఫైల్ ఫొటో)
విల్ సర్వీసెస్‌లో మధోపట్టి విజయం
మధోపట్టి గ్రామం నుంచి 1914లో మొదటి సివిల్ సర్వెంట్‌గా ఖాన్ బహదూర్ సయ్యద్ మొహమ్మద్ ముస్తఫా (ప్రముఖ కవి వామిఖ్ జౌన్‌పూరీ తండ్రి) ఎంపికయ్యారు. 1952లో ఇందూ ప్రకాశ్ సింగ్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికై 16 దేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు. 1955లో వినయ్ కుమార్ సింగ్ ఐఏఎస్‌గా ఎంపికై బీహార్ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు.
ఈ గ్రామంలో అత్యంత ప్రత్యేకమైన విజయం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు వినయ్ కుమార్ సింగ్, చత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎంపిక కావడం. వీరిలో చత్రపాల్ సింగ్ తమిళనాడు చీఫ్ సెక్రటరీగా సేవలందించారు. ఈ నలుగురు సోదరుల విజయం గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఒకరికొకరు మార్గదర్శనం చేసుకుంటూ, సహకరించుకుంటూ ఈ విజయాన్ని సాధించారు.
సివిల్ సర్వీసెస్‌కు మించిన ప్రతిభ
మధోపట్టి ప్రతిభ కేవలం సివిల్ సర్వీసెస్‌కు పరిమితం కాలేదు. డాక్టర్ గ్యానూ మిశ్రా ఇస్రో శాస్త్రవేత్తగా, జన్మజయ్ సింగ్ వరల్డ్ బ్యాంక్‌లో ఉన్నతాధికారిగా, డాక్టర్ నీరూ సింగ్, లలేంద్ర ప్రతాప్ సింగ్ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో శాస్త్రవేత్తలుగా విజయవంతంగా సేవలందిస్తున్నారు. ఈ విజయాలు గ్రామంలో విద్య పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధతను, కష్టపడి పనిచేసే సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
గ్రామంలోని కుటుంబాల్లోని కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు కూడా సివిల్ సర్వీసెస్‌తో పాటు ఇతర ప్రతిష్ఠాత్మక రంగాల్లో రాణిస్తున్నారు. ఈ గ్రామంలోని యువత కళాశాలలో అడుగుపెట్టిన వెంటనే యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. ఇది వారి క్రమశిక్షణ, లక్ష్య సాధనను తెలియజేస్తుంది.
2022లో ఉత్తర ప్రదేశ్ నుంచి సివిల్స్ కు ఎంపికైన వారితో మదోపట్టి సివిల్ సర్వెంట్లు (ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్‌కు స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది యువత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవుతోంది. మధోపట్టి గ్రామం వారికి ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. ఈ గ్రామంలో కోచింగ్ సెంటర్లు లేకపోయినా, ఆధునిక సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా, కేవలం కఠిన శ్రమ, అంకితభావం, పరస్పర సహకారంతో ఈ గ్రామం అసాధారణ విజయాలను సాధించింది.
ఆంధ్రప్రదేశ్ యువత మధోపట్టి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి...
నలుగురు సోదరులు ఒకరికొకరు మార్గదర్శకంగా పనిచేసి విజయం సాధించినట్లే, ఆంధ్రప్రదేశ్ యువత కూడా సహచరులతో సహకరించుకుంటూ... జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా విజయవంతం కావచ్చు.
మధోపట్టిలోని యువత కళాశాలలో అడుగుపెట్టిన వెంటనే యూపీఎస్సీకి సన్నద్ధమవుతుంది. ఇదే స్ఫూర్తిని ఏపీ యువత అలవర్చుకోవాలి.
పరిమిత వనరులతోనూ మధోపట్టి గ్రామం విద్యను ప్రోత్సహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ యువత కూడా విద్యను ప్రాధాన్యతగా భావించాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువత చదువులో ముందుంటున్నారు.
సివిల్ సర్వీసెస్‌తో పాటు ఇస్రో, వరల్డ్ బ్యాంక్ వంటి రంగాల్లో మధోపట్టి యువత విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ యువత కూడా వివిధ రంగాల్లో అవకాశాలను అన్వేషించాలి. విదేశీ చదువులు, ఉద్యోగాలపై చూపిస్తున్న ఆసక్తి కంటే దేశంలోనే ఉన్నత ఉద్యోగాలపై ఆసక్తి పెంచుకుని చదువుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు
ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌తో పాటు ఇస్రో, డీఆర్డీఓ, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ) (Bhabha Atomic Research Centre) వంటి సంస్థలలో అవకాశాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో ఉన్న విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అమరావతి రాజధాని అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. జనవరి 2022 నాటికి రాష్ట్రంలో నమోదైన మొత్తం నిరుద్యోగుల సంఖ్య 6,16,689గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో అప్పట్లో తెలిపింది. ఇందులో 4,22,055 మంది పురుషులు, 1,94,634 మంది మహిళలు ఉన్నారు. ఇందులో గ్రాడ్యుయేట్స్ ఎంత మంది ఉన్నారనేది స్పష్టంగా లేకపోయినా 2022-23లో నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ రేటు 24 శాతంగా ఉంది. ఇది దేశంలోని రాష్ట్రాలలో మూడవ అత్యధికం. ఈ నేపథ్యంలో మధోపట్టి గ్రామం విజయం ఆంధ్రప్రదేశ్ యువతకు స్ఫూర్తిని, దిశానిర్దేశాన్ని అందిస్తుంది.
మధోపట్టి ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, దాని విజయాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. పరిమిత వనరులతో, కోచింగ్ సెంటర్లు లేకుండా, కేవలం కఠిన శ్రమ, సహకారం, విద్యపై నిబద్ధతతో ఈ గ్రామం అసాధారణ విజయాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్ యువత ఈ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, సివిల్ సర్వీసెస్‌తో పాటు ఇతర రంగాల్లో కూడా తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. మధోపట్టి గ్రామం నీడలో ఆంధ్రప్రదేశ్ యువత కొత్త ఉత్తేజంతో దేశ సేవలో తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవ్వాలి.
దేశానికి సేవ చేయాలన్న తపనతో ప్రతి ఏటా లక్షలాది మంది యువత యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతారు. ఐఏఎస్, ఐపీఎస్ కావాలనేది వారి కల. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 208 ఇళ్లున్న ఓ చిన్న గ్రామం దేశానికి ఏకంగా 47 మంది సివిల్ సర్వెంట్లను అందించి, ‘ఆఫీసర్ల ఫ్యాక్టరీ’గా పేరుగాంచిందంటే మీరు నమ్ముతారా?
‘UPSC విలేజ్’
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఉన్న మధోపట్టి అనే ఈ చిన్న గ్రామం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జనాభా 2011 లెక్కల ప్రకారం కేవలం 1,174 లోపే ఉన్నప్పటికీ, ఈ గ్రామంలోని దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ప్రభుత్వ ఉన్నత పదవిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి 47 మంది IAS, PCS, IPS అధికారులుగా దేశానికి సేవలందించారు.
విజయ పరంపర ఎలా మొదలైంది?
మధోపట్టి విజయ గాధ 1952లో ప్రారంభమైంది. ఈ గ్రామానికి చెందిన ఇందు ప్రకాశ్ సింగ్ యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి IFS అధికారిగా ఎంపికైన తొలి వ్యక్తి. ఆయన స్ఫూర్తితో 1955లో వినయ్ కుమార్ సింగ్ IAS అయ్యారు. ఆయన బిహార్ చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. వారి విజయం గ్రామ యువతకు కొత్త బాట వేసింది.
ఇక్కడి విద్యార్థులు పాఠశాల విద్య పూర్తైన వెంటనే సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా చేసుకుని సాధన ప్రారంభిస్తారు. తమ కళ్లముందే ఎందరో సీనియర్లు అధికారులుగా మారడం చూసి, యువతలో పట్టుదల పెరిగింది.
ఒకే కుటుంబం నుంచి నలుగురు సోదరులు (ఇద్దరు IAS, ఇద్దరు IPS) యూపీఎస్సీలో విజయం సాధించడం ఈ గ్రామ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఇది మిగతావారికి గొప్ప ప్రేరణగా నిలిచింది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ, మార్గనిర్దేశం చేసుకుంటూ పరీక్షలకు సిద్ధమవడం ఇక్కడి ప్రత్యేకత.
సివిల్స్ మాత్రమే కాదు.. అంతకు మించి!
మధోపట్టి ప్రతిభ కేవలం సివిల్ సర్వీసెస్‌కే పరిమితం కాలేదు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ జ్ఞాను మిశ్రా ఇస్రో శాస్త్రవేత్తగా, జన్మేజయ్ సింగ్ ప్రపంచ బ్యాంకులో ఉన్నత అధికారిగా సేవలందించారు. వీరితో పాటు అనేక మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక శాఖల్లో పనిచేస్తూ గ్రామ కీర్తిని దశదిశలా చాటుతున్నారు.